బ్రహ్మ మలిచిన కొమ్మలు కాదు వీళ్లు. చందమామ కథల్లోని రాకుమారి కన్నా సుకుమారంగా కనిపించే ఈ కోమలాంగులు నిజమైన అయోనిజలు. కోడింగ్ కొమ్మకు పూసిన గ్రాఫిక్ రెమ్మలు. డిజిటల్ అల్గారిథమ్స్ తీగకు కాసిన ఆర్టిఫీషియల్ ఆర్చిడ్ పుష్పాలు. మానవ ఊహకు అందని ఈ సుందరీమణులు కృత్రిమ మేధ మానస పుత్రికలు. అయితేనేం… దేశదేశాలకు చెందిన ఈ ఏఐ తోయజాక్షులకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు! సామాజిక మాధ్యమాల్లో వీళ్లు పలికే ప్రతి మాటా శిలాశాసనమే! వీళ్లు ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే ఎంతటి పీనాసి అయినా… సన్యాసి అయినా కొనితీరాల్సిందే! ఒక సమస్యను ప్రస్తావిస్తే… అది యువతను పిడికిళ్లు బిగించేలా చేయాల్సిందే!! అందుకే వీళ్లు పేరున్న ఇన్ఫ్లూయెన్సర్లు.
Miss AI | ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఏఐ మోడల్స్ అందచందాలు, ప్రతిభాపాటవాలకు ముగ్ధులైన యూకేకి చెందిన ఫ్యాన్ వ్యూ అనే డిజిటల్ క్రియేషన్‌కు సంబంధించిన సంస్థ వాళ్లు ‘మిస్ ఏఐ’ పోటీలకు తెరలేపారు. అందులో ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు సముద్ర జలాల పరిరక్షకులు, మానవ హక్కుల కార్యకర్తలూ ఉన్నారు. మిస్ యూనివర్స్ అందాల పోటీలకన్నా రంజుగా సాగుతున్న ఈ కాంపిటీషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్! ఏఐ మోడళ్ల అందాలు, సాంకేతిక నైపుణ్యాలు, సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతుల ఆధారంగా మిస్ ఏఐని ఎంపిక చేయనున్నారు.
ఇందులో దాదాపు 1500 మంది కృత్రిమ అందగత్తెలు హొయలొలికించారు. వీరిలో పదిమంది సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందులో భారత్‌కి చెందిన జారా శతావరి కూడా ఉంది. ఇక, ఈ మిస్ ఏఐ కిరీటాన్ని చేజక్కించుకునేది ఎవరో తేల్చడానికి ఇద్దరు మానవ మాత్రులతో పాటు రెండు ఏఐ సృష్టించిన ఇన్ఫ్లూయెన్సర్ పాత్రలూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తుండటం విశేషం! మొదటి ముగ్గురు ఊహా సుందరులు కోటీ 67 లక్షల రూపాయలను ప్రైజ్ మనీగా గెలుచుకోనున్నారు.‘ఫ్యాన్ వ్యూ’ సంస్థ మిస్ ఏఐ ఫైనల్స్‌కు చేరుకున్న ఈ మాయారంభలు ఎవరంటే..
భారత్10,000కు పైగా ఫాలోవర్లు హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్
ఫ్రాన్స్ లక్షకు పైగా ఫాలోవర్లు లైఫ్ ైస్టెల్ ఇన్ఫ్లూయెన్సర్
టర్కీ 27 వేలకు పైగా ఫాలోవర్లు మోడల్
రొమేనియా 4,000మంది ఫాలోవర్లు ఎల్‌జీబీటీక్యూఏఐ ఉద్యమకారిణి, బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్ (విభిన్న రకాల శరీరాకృతులు, వర్ణాలను సమంగా చూడటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం గురించి ప్రచారం చేయడం)
బ్రెజిల్ 11,000పై చిలుకు ఫాలోవర్లు ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్
బంగ్లాదేశ్ 13.6 వేల మంది ఫాలోవర్లు మానవ హక్కుల కార్యకర్త
ఫ్రాన్స్ 10,200 పైచిలుకు సముద్ర జలాల సంరక్షకురాలు
టర్కీ సుమారు 19 వేల మంది ఫాలోవర్లు కార్ల ఔత్సాహికురాలు
పోర్చుగల్ 12,500 ఫాలోవర్లు ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్
మొరాకో 1,97,000కు పైగా ఫాలోవర్లు మహిళా సాధికారత ఉద్యమకారిణి