Dear Zindagi | నేను నల్లగా, బొద్దుగా ఉంటా.. నాపై ఎందుకింత వివక్ష?
నా వయసు పందొమ్మిది. నల్లగా, బొద్దుగా ఉంటాను. స్కూల్ రోజుల్లో ఏ సమస్యా ఉండేది కాదు. ఇంటర్‌లోనూ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇంజినీరింగ్‌కు వచ్చాక.. తోటి విద్యార్థినుల నుంచే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఓ అమ్మాయి నా గురించి ‘అగ్లీ’ అంటూ కామెంట్ చేసింది.
Dear Zindagi | నా వయసు పందొమ్మిది. నల్లగా, బొద్దుగా ఉంటాను. స్కూల్ రోజుల్లో ఏ సమస్యా ఉండేది కాదు. ఇంటర్‌లోనూ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇంజినీరింగ్‌కు వచ్చాక.. తోటి విద్యార్థినుల నుంచే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఓ అమ్మాయి నా గురించి ‘అగ్లీ’ అంటూ కామెంట్ చేసింది. ఒకరిద్దరు చాటుగా నవ్వుకోవడమూ చూశాను. కాలేజ్ బస్సులో నా పక్కన కూర్చోడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఇవన్నీ చూశాక, నా మీద నాకేవిరక్తి కలుగుతున్నది. చదువు మానేసి ఇంటికి వెళ్లిపోదాం అనిపిస్తున్నది. కానీ, కుటుంబ పరిస్థితులు గుర్తుకొచ్చి, సాహసం చేయలేకపోతున్నా. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలూ వస్తున్నాయి. మీ సలహా ఏమిటి?
-ఓ పాఠకురాలు
ఆత్మహత్య పిరికివాళ్ల పని. ఆ ఆలోచనే వద్దు. చదువు మానేయడం సమస్యకు పరిష్కారం కానేకాదు. ఇంత తీవ్రమైన నిర్ణయం సరికాదు. నలుపు, తెలుపు, ఎరుపు.. మనం ఎంచుకున్న రంగులు కాదు. బొద్దుగా ఉండటమూ మీ తప్పు కాదు. మీ ప్రమేయంలేని విషయాల గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం ఎందుకు? ఆ వ్యాఖ్యలుకు సంస్కారానికి సంకేతాలు. అలాంటివారిని చూసి జాలి పడండి. అదే సమయాన్ని మీ లక్ష్యానికి కేటాయించండి. ఉన్నతంగా ఎదగండి.
మీ వ్యక్తిత్వాన్ని, తెలివితేటల్ని, సమర్థతను సమాజం గుర్తించి, గౌరవించే స్థాయికి చేరుకోండి. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాయామం, పౌష్టికాహారం ద్వారా అదనపు బరువును వదిలించుకునే ప్రయత్నం చేయండి. మాత్ర వేసుకోగానే మంత్రమేసినట్టు బరువు తగ్గిపోతారంటూ, చర్మానికి కొత్త నిగారింపు వస్తుందంటూ.. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రకటనలను చూసి మోసపోకండి. మిమ్మల్ని మీరు యథాతథంగా ఆమోదించండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

