నలభైల్లో ఏం తినాలి?
మహిళల్లో 40 ఏండ్లు దాటినప్పటి నుంచి జుట్టు పల్చబడటం, అలసట, కీళ్ల దగ్గర నొప్పుల్లాంటి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఇలా జరుగుతున్నదంటే, మన ఆహారంలో ఏదో లోపం ఉందని అర్థం. మెనోపాజ్ సమయంలోనూ ఆడవాళ్లలో బరువు పెరగడం, ఆస్టియోపొరోసిస్, గుండె జబ్బుల్లాంటి సమస్యలూ అధికం అవుతాయి.
మహిళల్లో 40 ఏండ్లు దాటినప్పటి నుంచి జుట్టు పల్చబడటం, అలసట, కీళ్ల దగ్గర నొప్పుల్లాంటి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఇలా జరుగుతున్నదంటే, మన ఆహారంలో ఏదో లోపం ఉందని అర్థం. మెనోపాజ్ సమయంలోనూ ఆడవాళ్లలో బరువు పెరగడం, ఆస్టియోపొరోసిస్, గుండె జబ్బుల్లాంటి సమస్యలూ అధికం అవుతాయి. ఈ వయసులో హార్మోన్లలో జరిగే మార్పుల్ని తట్టుకుంటూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఆరు ముఖ్య పోషకాలు అవసరం.
– ఓ పాఠకురాలు
కాల్షియం: వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఆస్టియోపొరోసిస్‌లాంటి ఎముకలు గుల్లబారే జబ్బులు వస్తాయి. నేషనల్ ఆస్టియోపొరోసిస్ ఫౌండేషన్ చెప్పిన ప్రకారం మహిళలకు రోజుకు 1.2 గ్రాముల కాల్షియం అవసరం. అందుకోసం ఆకుకూరలు, పాలు, కాల్షియం ఫోర్టిఫైడ్ ఆహారాలు తీసుకోవాలి.
విటమిన్-డి: కాల్షియంను శోషించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎముకల్ని దృఢపరచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది. స్త్రీలకు నిత్యం 600-800 ఐయూ విటమిన్-డి అవసరం అవుతుంది. సూర్యరశ్మి, చేపలు, ఫోర్టిఫైడ్ ఆహారాల ద్వారా దీన్ని గ్రహించవచ్చు.
మెగ్నీషియం: నరాలు, కండరాల పనితీరుతోపాటు రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రించడానికి మెగ్నీషియం సహకరిస్తుంది. 40 దాటిన మహిళలు రోజుకు 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకోవాలి. గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో అవసరం. మెదడు పనితీరును వేగవంతం చేసే ఇవి అవిసె, చియా, గుమ్మడి తదితర గింజలు, చేపల్లో దొరుకుతాయి.
ఇనుము: రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు ఇది చాలా ముఖ్యం. అలసట, నీరసంలాంటి వాటిని దూరం చేసేందుకు ఐరన్ చాలా అవసరం. రోజుకు 18 మిల్లీగ్రాములు తీసుకోవాలి. పప్పు దినుసులు, చిక్కుడు జాతి గింజలు, బెల్లంలాంటి వాటిలో ఇది అధికంగా ఉంటుంది.
పీచులు: జీర్ణవ్యవస్థను చురుగ్గా చేసి, గుండెజబ్బులు, మధుమేహంలాంటి వాటి నివారణలో ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. 40 ఏండ్లు పైబడ్డ మహిళలు రోజుకు 25 గ్రాముల పీచు పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, బీర, సొరకాయ లాంటి కూరగాయలు, చిక్కుళ్లలో ఇవి పుష్కలంగా లభిస్తాయి.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

