పవర్ఫుల్ షవర్ థాట్స్!
బుద్ధుడికి బోధి వృక్షం నీడన జ్ఞానోదయం అయినట్టు; న్యూటన్‌కు ఆపిల్ చెట్టుకింద భూమ్యాకర్షణ సిద్ధాంతం మదిలో మెదిలినట్టు.. కొందరికి స్నానం చేస్తున్నప్పుడే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. కఠినమైన సమస్యలకు షవర్ కింద ఉన్నప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి.
బుద్ధుడికి బోధి వృక్షం నీడన జ్ఞానోదయం అయినట్టు; న్యూటన్‌కు ఆపిల్ చెట్టుకింద భూమ్యాకర్షణ సిద్ధాంతం మదిలో మెదిలినట్టు.. కొందరికి స్నానం చేస్తున్నప్పుడే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. కఠినమైన సమస్యలకు షవర్ కింద ఉన్నప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి. ఈ ‘షవర్ థాట్స్’ వెనక.. సైన్స్‌తోపాటు సైకాలజీ సూత్రాలు కూడా ఉన్నాయి.

నేటి ఆధునిక మనిషి జీవితం.. ప్రతి క్షణం ఏదో ఒక ఆటంకంతోనే గడుస్తున్నది. నోటిఫికేషన్లు, ఈ మెయిల్స్, మెసేజ్‌లు.. మన మెదడును నిరంతరం డిస్టర్బ్ చేస్తుంటాయి. అయితే, షవర్లోని వాతావరణం మాత్రం.. ఈ స్క్రీన్లు, డిజిటల్ ఆటంకాలు లేని ప్రపంచం. కొన్ని నిమిషాల పాటు ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్ల ఆలోచనలు మరింత స్వేచ్ఛగా సాగుతాయి.

ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చుని ఎంత ప్రయత్నించినా.. సమస్యకు పరిష్కారం దొరక్కపోవచ్చు. ఆ తర్వాత, దానికి పూర్తిగా సంబంధం లేని ఏదో పని చేస్తున్నప్పుడు మదిలో పరిష్కారం మెదులుతుంది. అలాంటి సందర్భాల్లో స్నానం చేయడం కూడా ఒకటి. ఎందుకంటే, స్నానం చేస్తున్నప్పుడు మీ దృష్టి కేవలం సబ్బు, నీటి ఉష్ణోగ్రతపైనే ఉంటుంది. ఆ సమయంలో మీ ‘సబ్ కాన్షియస్ మైండ్’.. వెనుక ఉండి ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తూనే ఉంటుంది.

మెదడు ఒకే పనిపై ఎక్కువ దృష్టి పెట్టనప్పుడు.. మన ఆలోచనలు స్వేచ్ఛగా సాగుతాయి. నడవడం, డ్రైవింగ్, స్నానం చేయడం లాంటి అలవాటైన పనులు చేస్తున్నప్పుడు.. మెదడు శ్రమతో కూడిన ఆలోచనల్లోంచి బయటికి వస్తుంది. దీనివల్ల మెదడు లోపలి పొరల్లో దాగిఉన్న ఆలోచనలు స్పృహలోకి వస్తాయి.

వేడి నీరు శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. కండరాలు సడలి, శ్వాస వేగం తగ్గి, శారీరక ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ స్థితి.. శరీరంలో డోపమైన్ విడుదల అవ్వడానికి సాయపడుతుంది. డోపమైన్ అనేది ప్రేరణ, ఆనందాన్ని ఇచ్చే రసాయనం. ఇది మన ఆలోచనలను సరికొత్త, సృజనాత్మకత వైపు పయనించడానికి తోడ్పడుతుంది.

షవర్ నుంచి నిరంతరం పడే నీటిధారల శబ్దం.. ఒక ప్రశాంతమైన ‘వైట్ నాయిస్’ లాగా పనిచేస్తుంది.
ఇది బయటి శబ్దాల వల్ల వచ్చే ఆటంకాలను తగ్గించి, మెదడును విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి స్థితిలో మెదడు మరింత లోతుగా ఆలోచిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Bath
- good ideas
- psychology
- science
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

