Valentines Day Special | మీరు ప్రేమించే వ్యక్తి గురించి మీకు ఎంతవరకు తెలుసు?
Valentines Day Special | ఈక్యూ బావుంటే జీవితంలో గెలుస్తాం. లవ్క్యూ బావుంటే.. ప్రేమలో విజయం సాధిస్తాం. వాలెంటైన్స్ డే-2023 సందర్భంగా మీరు ప్రేమించే మనిషి ఇష్టాయిష్టాల గురించి మీకేమాత్రం తెలుసో.. ఒక్కసారి బేరీజు వేసుకోండి.
Valentines Day Special | మన మనసుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి గురించి మనకు ఏ మేరకు తెలుసు? తనకు ఇష్టమైన రంగేది, మనసు పడే రింగేది? అభిమాన రచయిత ఎవరు, ఆరాధించే నటులెవరు?.. ఇవన్నీ చిన్నచిన్న విషయాలే. కానీ, ఒక్కో మల్లెనూ గుదిగుచ్చినప్పుడే పూలదండ అవుతుంది. ఒక్కో అభిరుచిని జోడించినప్పుడే వ్యక్తిత్వం ఆవిష్కృతం అవుతుంది. ఐక్యూ బావుంటే పోటీ పరీక్షల్లో గెలుస్తాం. ఈక్యూ బావుంటే జీవితంలో గెలుస్తాం. లవ్క్యూ బావుంటే.. ప్రేమలో విజయం సాధిస్తాం. వాలెంటైన్స్ డే-2023 సందర్భంగా మీరు ప్రేమించే మనిషి ఇష్టాయిష్టాల గురించి మీకేమాత్రం తెలుసో.. ఒక్కసారి బేరీజు వేసుకోండి.
1. తన కళ్లు ఎప్పుడు మెరుస్తాయి?
2. తన బుగ్గలు ఎప్పుడు ఎరుపెక్కుతాయి?
3. తనకు మత్తెక్కించే సువాసన?
4. తను మరీమరీ తినాలనుకునే వంటకం?
5. తను తరచూ వినే పాట?
6. తనెప్పుడూ కోట్ చేసే పుస్తకం?
7. తనకు మనసైన రంగు
8. తన ఊతపదం?
9. తన పర్సులోనో, బ్యాగులోనో తప్పక ఉండేది?
10. తను ఎక్కువసార్లు చూసిన సినిమా?
11. తన పాత ఫోన్ నంబర్లోని చివరి నాలుగంకెలు?
12. తన జీవిత లక్ష్యం?
13. తన డియరెస్ట్ ఫ్రెండ్?
14. తను ప్రస్తుతం చూస్తున్న వెబ్ సిరీస్?

మార్కులు విశ్లేషణ
నాకు తెలుసు.
12 నుంచి 14 ప్రశ్నలకు మీ జవాబు అయితే.. తన మనసు మీకు తెలుసని అర్థం. ప్రేమికులుగా మీకు గ్రేడ్ -ఎ ఇవ్వాల్సిందే.
తెలియదు.
సగానికిపైగా ప్రశ్నలకు ఇదే మీ సమాధానం అయితే.. ఇంకా పరిచయస్థుల్లానే భావించాల్సి ఉంటుంది. పరిపూర్ణ ప్రేమికుల జాబితాలో చేరడానికి కృషి చేయండి. ఇద్దరి మధ్యా కనిపించని అడ్డు తెరలేమైనా ఉంటే తొలగించుకోండి. మీరు గ్రేడ్-సిలో ఉంటారు.
చూచాయగా తెలుసు.
పది నుంచి పదిహేను ప్రశ్నలకు మీ సమాధానం అయితే.. తన మనసు లోతులను మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. మీకు గ్రేడ్-బి ఇవ్వొచ్చు.
ఎప్పుడూ అడగలేదు.
మెజారిటీ ప్రశ్నలకు ఇదే మీ జవాబు అయితే.. తనతో మరింత సమయం గడపండి. మనసు విప్పి మాట్లాడండి. అభిరుచులు తెలుసుకోండి. ఇష్టాలు గ్రహించండి. అప్పుడే ప్రేమ చిగురిస్తుంది. మీరు గ్రేడ్-డిలో ఉన్నారు.
Read More :
టాటూలతో జ్ఞాపకాలు పదిలం : గ్రాండ్‌పేరెంట్స్‌కు ఘన నివాళి
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

