కోయగూడెంలోని గంటదొర నివాసాన్ని తలపించేలా ఇంటిని అలంకరించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. అల్ట్రా మోడ్రన్ కస్టమర్ల అభిరుచిని అర్థం చేసుకున్న ఇంటీరియర్ నిపుణులు.. ఆధునికతను జోడించి మరీ ట్రైబల్ ఫర్నిచర్ రూపొందిస్తున్నారు.
అలాంటిదే ఈ డైనింగ్ సెట్ కూడా. ‘ఈ తరహా డిజైన్లు మనిషిని ప్రకృతితో అనుసంధానిస్తాయి. నిరాడంబరత వీటి ప్రత్యేకత’ అంటారు రాజన్ రాజేంద్ర అనే ట్రైబల్ ఆర్ట్ ఎక్స్పర్ట్.