చలికి చిగురుటాకులా..
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటాం మనం. మరి మొక్కలు? చలి నుంచి తప్పించుకోలేక.. ఆరుబయట పొడిగాలులు, మంచును తట్టుకోలేక నిర్జీవంగా, నిస్తేజంగా మారిపోతాయి.
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటాం మనం. మరి మొక్కలు? చలి నుంచి తప్పించుకోలేక.. ఆరుబయట పొడిగాలులు, మంచును తట్టుకోలేక నిర్జీవంగా, నిస్తేజంగా మారిపోతాయి. శీతకాలపు గండాన్ని దాటలేకపోతాయి. చిన్నపాటి ఉపాయాలతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
మల్చింగ్: చలిని తట్టుకునేందుకు, మోతాదుకు మించిన నీటి కారణంగా కుళ్లిపోకుండా ఉండేందుకు, పోషకాలు సమృద్ధిగా అందేందుకు.. మొక్క చుట్టూ ఉన్న ఉపరితలాన్ని కప్పి ఉంచాలి. ఈ ప్రక్రియనే ‘మల్చింగ్’ అంటారు. ఇందుకోసం ఎండుగడ్డి, కొబ్బరిపీచు, ఎండు ఆకులు
ఉపయోగిస్తారు.

నీరు:ఒక్కో మొక్కకు ఒక్కోలా నీటి అవసరం ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నా సరే.. పొడిగాలులు, తక్కువ తేమ కారణంగా ఎప్పటికప్పుడు నీరు అందిస్తూ ఉండాల్సిందే.
సూర్యరశ్మి: వరండాలోని మొక్కలను సూర్యరశ్మి తగిలే చోటుకు మార్చాలి. పెరట్లో మొక్కలు మరీ గుబురుగా పెరిగిపోయి వేర్లు కుళ్లిపోకుండా… దట్టంగా ఉన్న ఆకులను జాగ్రత్తగా తొలగించాలి.
రాత్రివేళల్లో: తెలంగాణలో చాలా చోట్ల చలికాలపు రాత్రులు గడ్డ కట్టించేస్తుంటాయి. పడిపోయిన ఉష్ణోగ్రతల నుంచి మొక్కల్ని కాపాడేందుకు రాత్రివేళ వాటి మీద గోనెసంచులు, ప్లాస్టిక్ కవర్స్, పాత దుప్పట్లు లాంటివి కప్పి ఉంచితే మంచిది.
..చలికాలం కొన్ని మొక్కలకు కష్టకాలమే కావచ్చు. అయినా, నిరాశ పడిపోకుండా వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. మరికొన్నేమో చలికాలంలోనే అందమైన పూలు ఇస్తాయి. క్యారెట్, క్యాలీఫ్లవర్, పాలకూర లాంటి కాయగూరలు చలికాలంలో మరింత రుచిగా ఉంటాయని చెబుతారు ఉద్యానవన నిపుణులు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- plants
- Sun rise
- water
- Winter Season
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

