బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని ఇంట్లో పెద్దలు చెబుతారు. ఈ సమయంలో చదివితే బాగా గుర్తుంటుందని బడిలో టీచర్లూ చెబుతుంటారు. సూర్యోదయానికి గంటన్నర ముందు నుంచి 48 నిమిషాల సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా పేర్కొంటారు పెద్దలు. ఈ సమయంలో నిద్ర లేచినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. కానీ, ఈ వేళను సమర్థంగా వాడుకుంటే.. బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణుల మాట.