బ్లూ టిక్.. సామాజిక మాధ్యమాల్లో సెలెబ్రిటీ హోదాకు చిహ్నం! దీన్ని పొందడానికి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా నిర్ణయించింది ట్విటర్. ఆ సంస్థ బ్లూ టిక్ వెరిఫికేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి స్కామర్లకు కొత్త ఆయుధం చేజిక్కినట్టయింది. సోషల్‌మీడియాలో మీ అకౌంట్‌ను గొప్పగా ప్రజెంట్ చేస్తామని, అదిరిపోయే ఇంట్రొడక్షన్ ఇస్తామని మభ్యపెట్టి స్కామ్‌లకు పాల్పడుతున్నారు కొందరు. ఇంకొందరు అదే దొంగదారుల్లో వెరిఫైడ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్‌ను నిండా ముంచుతున్నారు. ఆ బారినపడకుండా కొన్ని జాగ్రత్తలుతీసుకోవడం తప్పనిసరి. లేకపోతే, నిండా మునిగిపోతాం.
బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇప్పుడో ట్రెండ్. ట్విటర్ అనే కాదు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ వెరిఫైడ్ అకౌంట్‌గా గుర్తింపు వస్తే మహా గౌరవంగా భావిస్తుంటారు. సినిమా తారలు, క్రీడాకారులకు అధికారికంగా గుర్తింపు రావడం చిన్న విషయమే! కానీ, సాధారణ వినియోగదారులు సైతం తమకు అలాంటి గుర్తింపు ఉంటే బాగుంటుందనే యోచనలో ఉంటారు. దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు స్కామర్లు. విశ్వసనీయ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రముఖ ఆర్గనైజేషన్లకు చెందినవారుగా తమను తాము పరిచయం చేసుకుంటారు. పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇస్తామని ఉదారంగా ఆఫర్ చేస్తారు. ఆ మాయమాటలకు లొంగిపోతే మాత్రం సబ్స్క్రిషన్ రుసుము పేరిట బ్యాంకు ఖాతాలోని డబ్బంతా ఖాళీ చేసే ప్రమాదం ఉంది.
ఇలా ముంచేస్తారు
ఇవి గమనించండి..
ఎర కావొద్దు
సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్లుగా ఎదగాలని కోరుకునే చాలామంది ఇలాంటి ఫేక్ విన్యాసాలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటారు. ఫాలోవర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగాలని దిగజారుతారు. వెరిఫైడ్ మార్క్గానీ, బ్లూ టిక్ గానీ వస్తే తమకు మరింత క్రేజ్ పెరుగుతుందని ఆశిస్తారు. మరికొందరు స్పూఫ్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకొని.. వెరిఫైడ్ అకౌంట్ అని నమ్మేలా చేస్తారు. ఇలాంటి వ్యక్తులను, వాళ్లు క్రియేట్ చేసిన అకౌంట్లను గుడ్డిగా నమ్మితే తప్పులో కాలేసినట్టే. వాళ్ల స్వార్థానికి మీరు ఎర కావొద్దు. సోషల్ మీడియాలో ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లయితే వెంటనే స్పందించాలి. మరోసారి జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిలే అని సమస్యను దాటవేయొద్దు! వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. ఫ్రాడ్ అకౌంట్లు అని అనుమానం వస్తే కింద పేర్కొన్న లింక్‌ల ద్వారా రిపోర్ట్ చేయండి.
ట్విటర్: https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet
ఫేస్బుక్: https://www.facebook.com/help/1380418588640631
లింక్డ్ఇన్: https://www.linkedin.com/help/linkedin/answer/a1344213/recognize-and-report-spam-inappropriate-and-ab