గౌరవ్ షా డిజైన్ చేసిన చీరను కట్టుకోవడం ఓ గౌరవంగా భావిస్తారు మాడళ్లు. అతని దృష్టిలో చీర కూడా క్యాన్వాస్ లాంటిదే. కొంగు నుంచి అంచు వరకు అంగుళమైనా వదలకుండా రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తాడు. తాప్సీ కట్టుబడిలో తరించిన ఈ కలంకారీ చీర మీద రాజస్థానీ మినియేచర్ పెయింటింగ్స్ పునః సృష్టించాడు గౌరవ్. అందుకు సహజమైన రంగులనే వాడాడు. ఇది కంచిపట్టు చీర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.