స్పేస్‌లోకి.. అదే అంతరిక్షంలోకి వెళ్లడం పెద్ద కష్టమేం కాదిప్పుడు. కానీ, నాలుగు గోడల మధ్య ఉన్న స్పేస్‌ను సమర్థంగా వినియోగించుకోవడం మాత్రం రాకెట్ టెక్నాలజీని మించిన వ్యవహారం. ఈ సమస్యకు పరిష్కారంగా.. స్మోకీ కాక్ టెయిల్స్ సంస్థ వైవిధ్యమైన ఫర్నిచర్‌ను డిజైన్ చేసింది. వాటిని ఇంటీరియర్‌లో భాగం చేసుకోవచ్చు. నిత్య అవసరాలకూ ఉపయోగించుకోవచ్చు. ట్రే, బుక్స్టాండ్, యాష్‌ట్రే హోల్డర్.. ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు. ధరలు ఎక్కువైనా.. సంపన్న వర్గాలు ఇష్టంగా కొనేస్తున్నాయి.