ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్ చేస్తుంటారా? పెద్దపెద్ద టార్చ్లైట్లు మోసుకెళ్లడమే పెద్ద సమస్యగా ఉన్నదా? అయితే, Portronics Eco Glow Bolt పై ఓ లుక్కేయండి. ఇదో కాంపాక్ట్, పాకెట్-సైజ్ రీచార్జబుల్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్. పరిమాణంలో చిన్నదైనప్పటికీ.. గరిష్టంగా 650 ల్యూమెన్స్ బ్రైట్నెస్ను, 35 మీటర్ల దూరం వరకు ఫోకస్డ్ లైట్‌ను అందిస్తుంది. అవసరాన్ని బట్టి సర్దుబాటు చేసుకోవడానికి ఇందులో మూడు బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీని అడుగున బలమైన అయస్కాంతం ఉండటం వల్ల కారు బోనెట్, ఏదైనా ఐరన్ సర్ఫేస్పై అతికించి హాండ్స్-ఫ్రీగా పని చేసుకోవచ్చు. షర్ట్ ప్యాకెట్, ప్యాంట్, బ్యాగ్‌కు సులభంగా తగిలించుకోవడానికి దీనికి బలమైన క్లిప్ కూడా ఉంటుంది. అల్యూమినియం అలాయ్‌తో తయారైన దీని బాడీ.. దృఢంగా ఉండి, కింద పడినా పాడవదు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 400 ఎంఏహెచ్ రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే మోడ్‌ను బట్టి దాదాపు 5 గంటల వరకు పనిచేస్తుంది. చిన్న సైజు, తక్కువ బరువు ఉండటం వల్ల జేబులో, కీ-చైన్ తరహాలో సులభంగా మోసుకెళ్లవచ్చు.
ధర: రూ. 799
దొరుకుచోటు: portronics.com
కేర్ ఫ్రీ! హ్యాండ్స్ ఫ్రీ..

Verilux Type C Lanyard Cabl
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి కోసం ఓ వినూత్నమైన టూ ఇన్ వన్ గ్యాడ్జెట్ వచ్చింది. Verilux Type C Lanyard Cable.. చార్జింగ్ వైర్‌ను ప్రత్యేకంగా బ్యాగ్‌లో తీసుకెళ్లే శ్రమ లేకుండా చేస్తుంది. ఇది మొబైల్ చార్జింగ్ కేబుల్గానే కాదు.. మెడలో తగిలించుకునే ఫోన్ స్ట్రాప్గానూ పనిచేస్తుంది. సాధారణ చార్జింగ్ వైర్లా కాకుండా దీనికి మెటల్ బకిల్స్, ఫోన్ హోల్డర్ ప్యాచ్ ఉంటాయి. ఫోన్‌ను కేస్ లోపల ఉంచి, ఈ కేబుల్‌ను మెడలో తగిలించుకోవచ్చు. ఇది అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 240W పవర్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా.. ఐప్యాడ్లు, ట్యాబ్లెట్, టైప్-సి సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌ను కూడా సులభంగా చార్జ్ చేస్తుంది. అంతేకాదు.. ఈ వైర్ సాయంతో 480 ఎంబీపీఎస్ వేగంతో డేటాను బదిలీ చేసుకోవచ్చు. బైకింగ్, హైకింగ్, ఫొటోగ్రఫీ, షాపింగ్ చేసే సమయంలో హ్యాండ్స్ ఫ్రీగా ఉండటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ధర: రూ. 759
దొరుకుచోటు: అమెజాన్
దోమల పాలిట బ్రహ్మాస్త్రం..

Electric Uv Mosquito Killer
పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రతి చోటా దోమల బెడద పీడిస్తున్నది. వాటిని నివారించడానికి రసాయనాలు, పొగ, విషపూరిత పదార్థాలు వాడాల్సిన పరిస్థితి వస్తున్నది. దీనివల్ల మరో కొత్త సమస్య ఎదురవుతున్నది. అలా కాకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ Electric UV Mosquito Killer Lamp ఉండాల్సిందే! ఇందులో అమర్చిన ప్రత్యేక యూవీ ల్యాంప్.. దోమలను, చిన్న కీటకాలను ఆకర్షిస్తుంది. లోపలికి వచ్చే దోమలు అక్కడ ఉండే హై-వోల్టేజ్ విద్యుత్ గ్రిడ్‌ను తాకి వెంటనే చనిపోతాయి. అవన్నీ పరికరం అడుగు భాగంలో ఉన్న ట్రేలో పడతాయి. దీనిని సులభంగా తెరిచి శుభ్రం చేసుకోవచ్చు. ఇది సాధారణ మస్కిటో కాయిల్స్, లిక్విడేటర్ల లాగా హానికరమైన రసాయనాలు, పొగ విడుదల చేయదు. కాబట్టి, ఆస్తమా, అలర్జీ ఉన్నవారికి, చిన్న పిల్లలకు చాలా సురక్షితం. దీనిని వాడటం కూడా చాలా సులభం. ప్లగ్-ఇన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. కరెంట్ వినియోగం కూడా చాలా తక్కువ. ఇది పనిచేస్తున్నప్పుడు ఎలాంటి పొగ, ఘాటైన వాసన రావు.
ధర: రూ. 999
దొరుకుచోటు: అమెజాన్
అడుగు దూరంలో ఆకాశ లోకం..

Dwarf 3 Smart Portable Tele
ఖగోళ శాస్త్రం, ఆస్ట్రో ఫొటోగ్రఫీపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వైల్డ్ లైఫ్ అబ్జర్వేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ రెండిటి కోసం DWARFLAB Dwarf 3 Smart Telescope అందుబాటులోకి వచ్చింది. ఇది సాధారణ టెలిస్కోప్‌ల మాదిరిగా కాకుండా, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో Sony Starvis 2 సెన్సర్, నైట్ విజన్ టెక్నాలజీని వాడారు. తక్కువ వెలుతురులోనూ నెబ్యులా, గెలాక్సీలు, నక్షత్ర రాశులను అద్భుతంగా చూపిస్తుంది. ఇందులోని ఈక్వటోరియల్ మౌంట్ మోడ్.. ఆకాశ భ్రమణం వల్ల వచ్చే ఫీల్డ్ రొటేషన్‌ను నివారిస్తుంది. మొబైల్ యాప్‌లోని స్టార్ మ్యాప్‌లో నచ్చిన నక్షత్రాన్ని, గ్రహాన్ని ఎంచుకుంటే.. టెలిస్కోప్ ఆటోమేటిక్‌గా ఆ దిశకు తిరిగి ట్రాక్ చేస్తుంది. రాత్రివేళల్లో ఆకాశాన్ని చూడటమే కాకుండా, పగటివేళ పక్షులు, జంతువులను ఆటో-ట్రాకింగ్ చేస్తూ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కెమెరాగానూ దీనిని ఉపయోగించవచ్చు. విద్యార్థులు, కొత్తగా ఆస్ట్రోఫొటోగ్రఫీ చేయాలనుకునేవారికి
చాలా సౌకర్యంగా ఉంటుంది.
ధర: రూ. 84,999
దొరుకుచోటు: అమెజాన్