ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం బరువంతా ఆడవాళ్లపైనే. అదనంగా కెరీర్ బాధ్యతలు. ఆ పరుగులో పడిపోయి తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి..
ఉన్నట్టుండి నీరసిస్తే
తరచూ నడక, మాటలు తడబడుతుంటే ఆరోగ్యం పట్ల ఇంకొంత శ్రద్ధ తీసు కోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
తరచూ ఊపిరాడకపోతే
సరిగ్గా ఊపిరాడకపోతే.. శరీరానికి కావాల్సినంత రక్తాన్ని గుండె సరఫరా చేయలేదు. ఊపిరాడకపోవడం, ఆయాసం గుండెపోటుకు హెచ్చరికలు.
నేత్ర సమస్యలుంటే
ఉన్నట్టుండి చూపు మసకబారినట్టు అనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌కు అదో సంకేతం. రెటీనాలో లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది. భవిష్యత్తులో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఛాతీలో నొప్పి అనిపిస్తే
గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీ, భుజాలు, చేతులు, దవడ భాగాల్లో నొప్పి.. ప్రమాద ఘంటికలు. కవాట కండరాల కదలికల్లో సమస్య ఉన్నప్పుడే ఈ ఇబ్బందులు వస్తాయి.
ఒక్కసారిగా బరువు తగ్గితే
హఠాత్తుగా బరువు తగ్గితే మురిసిపోవద్దు. థైరాయిడ్ గ్రంథి అధికంగా స్రవించడం వల్ల ఇలా జరగొచ్చు. డయాబెటిస్, క్యాన్సర్ లక్షణం కావచ్చు. డిప్రెషన్ సంకేతంగానూ భావించవచ్చు.
గురక ఇబ్బందిపెడితే
నిద్రలో గురక ఇబ్బంది పెడుతుంటే.. గుండె సమస్యలు, అధిక బరువు చుట్టుముట్టే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి.
విపరీతమైన అలసటకు గురైతే
తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుంటే.. జీవక్రియలు సక్రమంగా జరగడం లేదని భావించాలి. క్యాన్సర్, డిమెన్షియా, పార్కిన్సన్ వ్యాధుల లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి.
రుతుస్రావంలో మార్పులుంటే
రుతుస్రావ చక్రంలో ఒక్కసారిగా మార్పులు వస్తే ఆరోగ్యంలో ఏదో తేడా ఉందని గుర్తించాలి. మెనోపాజ్, గర్భకోశ వ్యాధులకు ముందస్తు హెచ్చరికగానూ అనుమానించాలి.
మచ్చలు కనిపిస్తే..
వివిధ భాగాల్లో చర్మం రంగు నల్లగా మారితే డయాబెటిస్‌కు సూచన. చర్మ క్యాన్సర్ లక్షణాల్లో ఇదీ ఒకటి.