రెండో దుద్దు పెద్దదే ముద్దు!
చెవిపోగుతో పాటు సెకండ్ స్టడ్ పెట్టుకోవడం కొంతమందికి చాలా ఇష్టం. అయితే మామూలు జుంకాలకంటే సెకండ్ స్టడ్ చిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాటినీ సాధారణ చెవిపోగుతో సమానంగా ధరిస్తున్నారు యువతులు. రెండో జుంకా అయినా సరే, సైజు విషయంలో తగ్గేదేలే అంటున్నారు.
చెవిపోగుతో పాటు సెకండ్ స్టడ్ పెట్టుకోవడం కొంతమందికి చాలా ఇష్టం. అయితే మామూలు జుంకాలకంటే సెకండ్ స్టడ్ చిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాటినీ సాధారణ చెవిపోగుతో సమానంగా ధరిస్తున్నారు యువతులు. రెండో జుంకా అయినా సరే, సైజు విషయంలో తగ్గేదేలే అంటున్నారు.
ప్రత్యేకమైన సందర్భాల్లోనే కాదు, రోజువారీ అలంకరణలో కూడా చెవి పోగులకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిని మారిస్తే చాలు లుక్కే మారిపోతుంది చాలా సార్లు. అందుకే మెడలో నగలు ఉన్నా, లేకపోయినా చెవులకు మాత్రం తప్పక పోగులు పెట్టుకుంటారు. దాంతో పాటు సెకండ్ స్టడ్‌ను తమ ైస్టెల్ స్టేట్మెంట్గా భావించేవారూ ఉన్నారు. కింది వాటికి మ్యాచ్ అయ్యేలా, రెండో వాటిని మారుస్తూ ఉంటారు. సాధారణంగా ముక్కుపుడకలా ఒకే రాయి వచ్చినవీ, నక్షత్రా
కారానివీ లేదా చిన్న రింగుల్లాంటి వాటిని దీని కోసం ఉపయోగిస్తుంటారు.
అయితే ఇప్పుడు మొదటి దుద్దు ఎంత పరిమాణంలో ఉందో, రెండోది కూడా అంతే సైజులో ఉండేలా అలంకరించుకుంటున్నారు. అవి పొడవాటి జుంకాలైనా, గుండ్రటి రింగులైనా, వేలాడే హూప్ ఇయర్రింగ్స్ అయినా సరే. ఒకదానికొకటి మ్యాచ్ అయ్యేలా కొన్నిటిని ఎంచుకుంటే, అచ్చం మొదటి జుంకాలాగే రెండోదీ పెట్టుకునే వారు ఉన్నారు. అభిరుచిని బట్టి ఏది ధరించినా, లుక్ మాత్రం కొత్తగా ఉండటం ఇందులోని ప్రత్యేకత. చిన్న మార్పుతో పెద్ద తేడా కనిపించాలని కోరుకునే వాళ్లు ఈ ైస్టెల్‌ను ఫాలో అయిపోవచ్చు… వావ్ అనిపించుకోవచ్చు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

