పేడ పురుగే పెద్ద ఫ్యాషన్!
ఫ్యాషన్ ప్రపంచం చిత్రమైంది.. విచిత్రమైంది కూడా. తనలో పువ్వుల్ని ఎంత ఇష్టంగా పొదువుకొంటుందో పురుగుల్నీ అంతే ఇదిగా చేరదీస్తుంది. కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నట్టు... పువ్వయినా పురుగైనా మాకు గొప్పే అంటుంది.
ఫ్యాషన్ ప్రపంచం చిత్రమైంది.. విచిత్రమైంది కూడా. తనలో పువ్వుల్ని ఎంత ఇష్టంగా పొదువుకొంటుందో పురుగుల్నీ అంతే ఇదిగా చేరదీస్తుంది. కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నట్టు… పువ్వయినా పురుగైనా మాకు గొప్పే అంటుంది. అందుకే, వానకాలంలో కనిపించే పేడపురుగుల ఆకారాన్ని నగల డిజైన్లలో పొదిగి తన విభిన్నత్వాన్ని చాటుకుంటున్నది. ‘స్కారబ్ బీటిల్ జువెలరీ’ ఈ సీజన్లో కొత్త ట్రెండు.

కాస్త చీకటి పడితే చాలు… లైట్ల వైపుగా ఇళ్లలోకి పరుగులు తీస్తుంటాయి పేడ పురుగులు. రెక్కల సాయంతో అటూ ఇటూ ఎగిరే ఈ జీవాల్ని కట్టడి చేయడం కాస్త కష్టమైన పనే. కానీ వాటి డిజైన్లు నగల్లో కనిపించడం, అలాంటి వాటిని ధరించడం ఇప్పుడు క్రేజ్‌గా మారింది. నిజానికి స్కారబ్ బీటిల్ జువెలరీ అన్నది ఈజిప్షియన్ల కాలానిది. మట్టిని లేదా పేడను ఉండలుగా చేస్తూ నడిచే ఈ ప్రాణిని సూర్యుడికి గుర్తుగా భావించేవారట. అందుకే వాళ్ల సంస్కృతిలో అంత పవిత్ర స్థానం లభించింది.

శక్తికి, రక్షణకు, అదృష్టానికి చిహ్నంగానూ భావిస్తారు. అంతేకాదు, పునరుత్పత్తికి సంకేతంగా… బిడ్డల కోసం ఎదురు చూసే తల్లులకు వీటిని బహుమతిగా ఇస్తారు. ఆ తర్వాతి కాలంలో ఇటలీ, ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్ తదితర దేశాలకు ఈ సంస్కృతి పాకింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా నగలు తయారవుతున్నాయి. బ్రేస్లెట్లు, ఉంగరాలు మొదలు నెక్లెస్‌లు, బ్రూచ్ల లాంటివీ ఈ డిజైన్లలో రూపొందిస్తున్నారు. పచ్చలు, నీలాలు, కెంపుల్ని పొదుగుతున్నారు ఇందులో. వీటి వెనక కథ ఏదైనా, క్రేజీగా కనిపిస్తుండటంతో కుర్రకారు కెవ్వుకేక పెడుతున్నారు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

