Sara Tendulkar : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయగా సారా టెండూల్కర్ (Sara Tendulkar) మనందరికీ సుపరిచితమే. తండ్రి వారసత్వాన్ని తమ్ముడు అర్జున్ అందుకోగా.. తనకంటూ సొంత గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఈమధ్యే ముంబైలో ‘పిలాటిస్ అకాడమీ’ ప్రారంభించింది సారా. కొన్నాళ్లు ఫ్యాషన్ మోడల్‌గా రాణించిన ఈ యంగ్ బ్యూటీ నవతరాన్ని ఫిట్నెస్.. వెల్నెస్ దిశగా నడిపించాలనుకుంటోంది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సారా.. తన జీవితంలోని పలు విషయాల్ని పంచుకుంటుంది కూడా. తన అలవాట్లు.. ఆరోగ్య రహస్యం ఇలాంటివి వెల్లడించే తను ఈసారి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) గురించి చెప్పింది. టీనేజ్‌లో.. ఎంతోమంది అమ్మాయిలను నానా ఇబ్బందులకు గురిచేసే ఈ సమస్యను తాను ఎదుర్కొన్నానని తెలిపింది. ఇంతకూ తాను ఈ సమస్య నుంచి ఎలా బయటిపడిందో వివరించింది సచిన్ డాటర్.
As a parent, you always hope your children find something they truly love doing. Watching Sara open a Pilates studio has been one of those moments that fills our hearts.
She has built this journey with her own hard work and belief, brick by brick.
Nutrition and movement have… pic.twitter.com/lpRYj6mXer
— Sachin Tendulkar (@sachin_rt) August 22, 2025
‘నేను స్కూల్ డేస్‌లోనే పీసీఓఎస్ సమస్యను ఎదుర్కొన్నాను. హార్మోన్లలో సమతుల్యం కొరవడడంతో ముఖంపై నల్లమచ్చలు ఏర్పడేవి. ఆ మచ్చలు నా ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపాయి. చర్మం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే నన్ను అవి చాలా ఇబ్బందికి గురి చేశాయి. దాంతో.. మేకప్ లేకుండా బయటకు వెళ్లేదాన్ని కాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులను ప్రయత్నించాను. కానీ, చివరకు అమ్మ అంజలి సలహాతో.. పీసీఓఎస్ సమస్యకు సరైన పరిష్కారం చూపగల అనుభవజ్ఞులైన నిపుణులను కలిశాను. వాళ్లు చెప్పినట్టుగా నా డైట్లో మార్పులు చేసుకున్నా.
అలానే ఫిట్నెస్, స్ట్రెంత్ ట్రైనింగ్ మీద దృష్టి సారించాను. అంతేకాదు జీవన శైలికి సంబంధించిన మార్పులు చేసుకున్నా. రోజూ వర్కవుట్లు చేయడం, పోషకాలతో నిండిన ఆహారం తినడం ద్వారా క్రమంగా పీసీఓఎస్ నుంచి బయటపడ్డాను. ఏ సమస్యకైనా సత్వర పరిష్కారం ఉండదు. అందుకే పీసీఓఎస్ విషయంలోనూ ఓపికగా ఉండడం.. సరైన సలహాలు పాటించడం అనేవి చాలా కీలకం. అమ్మాయిలు తమకు ఈ సమస్య ఉందని బాధపడొద్దు. అమ్మతోనే లేదా వైద్యులతోనో పంచుకొని బయటపడే మార్గాలను అనుసరించాలి’ అని తాను ఈ సమస్యను అధిగమించిన తీరును వివరించింది సచిన్ డాటర్.
బయోమెడికల్ సైన్స్‌లో డిగ్రీ.. ఆ తర్వాత క్లినికల్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో పీజీ చదివిన సారా కొన్నిరోజులు మోడల్‌గానూ మెరిసింది. ఈమధ్యే తమ కుటుంబం నిర్వహిస్తున్న సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (Sachin Tendulkar Foundation)లో డైరెక్టర్‌గా చేరింది సారా. ఇప్పుడు ‘పిలాటెస్ స్టూడియో’తో ఈ తరానికి ఫిట్నెస్, వెల్నెస్ పాఠాలు బోధించనుందీ బ్యూటిఫుల్ లేడీ.
ఆకట్టుకునే రూపం.. సినీ తారలను తలదన్నేంత అందంగా కనిపించే సారా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఆమె తన రోజును నీళ్లు తాగడంతో మొదలెడుతుంది. ఆ తర్వాత కొన్ని బాదం, పిస్తా.. వంటి నట్స్.. మట్చా టీ, బ్లాక్ టీ తాగుతుంది. అనంతరం వర్కవుట్లు చేస్తూ శరీరాకృతిని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. బీజీగా ఉన్న రోజుల్లో కనీసం 15 నిమిషాలైనా నడుస్తాను అంటోందీ క్రికెట్ దిగ్గజం కూతురు.
I’m overjoyed to share that my daughter Sara Tendulkar has joined the @STF_India as Director.
She holds a Master’s degree in Clinical and Public Health Nutrition from University College London. As she embarks on this journey to empower India through sports, healthcare, and… pic.twitter.com/B78HvgbK62
— Sachin Tendulkar (@sachin_rt) December 4, 2024