స్మార్ట్‌ఫోన్ వచ్చి ఎన్నేళ్లయినా.. టచ్‌స్క్రీన్‌పై ఉన్న క్వర్టీ కీబోర్డుపై టైప్ చేయడం కాస్త చాలెంజింగ్గానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక కీని నొక్కితే మరొకటి ప్రెస్ అవుతుంది. అందుకే గతంలో ఫిజికల్ క్వర్టీ కీ ప్యాడ్ ఉన్న ఫోన్లు సందడి చేశాయి. కానీ, ఈ మధ్యకాలంలో కీప్యాడ్ కనిపించకుండా పోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మరో కొత్త అవతార్‌తో మన ముందుకు రాబోతున్నది. అదీ ఫోన్ కవర్ రూపంలో ముస్తాబై! క్లిక్స్ అనే కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌తో ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చిత్రంలో మాదిరిగా ఐఫోన్‌ని ఫిజికల్ కీబోర్డు ఉన్న కవర్లో ఉంచితే చాలు.. ఫోన్ బ్లూటూత్‌తో కీబోర్డుకి కనెక్ట్ అవుతుంది. అంతే.. ఇక కంపోజింగ్ ఎక్కడైనా ఎక్సటర్నల్ క్వర్టీ కీబోర్డుతోనే చేసేయొచ్చు. ‘కీ’ల మధ్య దూరాన్ని పెంచడంతో కంపోజింగ్ సులభం అవుతుంది. చాటింగ్, బ్రౌజింగ్‌ని ఇంకా ఎఫెక్టివ్‌గా చేయొచ్చు.
ధర: 11,900
దొరికే చోటు: https://encr.pw/ nk9ou
ట్రావెల్ వ్లాగ్స్.. కుకింగ్ వీడియోలు.. లేదా మరేదైనా కంటెంట్‌ని చేస్తూ యూట్యూబర్‌గా రాణించే ప్రయత్నం చేస్తున్నారా? అయితే, వీడియోల్లో మీ వాయిస్‌ని క్లిస్టర్ క్లియర్‌గా వినిపించేలా ఈ టైప్-సీ మైక్రోఫోన్‌ని వాడొచ్చు. పోర్ట్రోనిక్స్ సంస్థ దీన్ని తయారుచేసింది. నాయిస్ క్యాన్సిలేషన్‌తో మీ మాటల్ని స్పష్టంగా వినిపించేలా రికార్డు చేస్తుంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో పనిచేస్తుంది. అంటే.. టైప్-సీ ప్లగ్ ఇన్ని ఫోన్‌కి కనెక్ట్ చేయాలి. తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘ఓటీజీ కనెక్షన్’ని ఎనేబుల్ చేయాలి. అంతే.. తర్వాత మైక్రోఫోన్ పపర్ ఆన్‌చేస్తే చాలు. గ్రీన్ లైట్ స్టేబుల్‌గా వెలుగుతుంది. దాని అర్థం మైక్రోఫోన్ ఫోన్‌కి కనెక్ట్ అయినట్టు అన్నమాట. ఇక మీరు రికార్డింగ్ మొదలుపెట్టొచ్చు. మైక్ పైన ఉన్న హై క్వాలిటీ స్పాంజ్ చిన్న చిన్న శబ్దాల్ని అడ్డుకుంటుంది. 360 డిగ్రీల కోణంలో మైక్ వాయిస్‌ని గ్రహిస్తుంది. దీంతో మాటల్లో ఎలాంటి హెచ్చుతగ్గులూ ఉండవు. 30 మీటర్ల దూరం నుంచి కూడా వైర్లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా ఈ మైక్ పనిచేస్తుంది. దీంతో వీడియోల చిత్రీకరణ సులభం అవుతుంది.
ధర: రూ.1,999
దొరికే చోటు: https://encr.pw/ETUHO
జీవితంలో ముఖ్యమైన సందర్భాల్ని షూట్ చేసి పెట్టుకోవడం ఒకప్పుడు.. ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజూ పండగే.. అందుకే ప్రతి మూమెంట్‌నీ సేవ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఫోన్‌తోపాటు షూటింగ్‌కు అనువైన గ్యాడ్జెట్లు వినూత్నంగా పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఇప్పుడు సరికొత్తగా ముస్తాబై వచ్చిందే.. ఈ ట్రాక్ స్టాండ్! ఇది ‘ఆటో ట్రాకింగ్ సిస్టమ్’తో పనిచేస్తుంది. అంటే, ఫోన్‌ని డాకింగ్ స్టాండ్‌కి సెట్ చేస్తే చాలు. ఫేస్, శరీర కదలికల ఆధారంగా 360 డిగ్రీల కోణంలో మన వెంటే కదులుతుంది. మీరు ఎటు వెళ్తే అటే తిరుగుతూ షూట్ చేస్తుంది. ఫోన్‌ని అడ్డంగానే కాదు.. నిలువుగానూ తిప్పేస్తుంది. వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించే క్రమంలో ఈ ట్రాకింగ్ స్టాండ్‌ని వాడొచ్చు. సింగిల్ బటన్‌తో ఆటో ట్రాకింగ్ స్టాండ్‌ని ఆన్/ఆఫ్ చేయొచ్చు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 5 గంటలు పనిచేస్తుంది.
ధర: 24,999
దొరికే చోటు: https://encr.pw/RLqd0
అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. వాటిలో లైట్స్ ఒకటి. అందుకే చార్జింగ్ లైట్స్‌ని బ్యాక్ అప్‌గా పెట్టుకుంటాం. మీరు కూడా ఎక్కడైనా అనువుగా వాడుకునేలా ఏవైనా చార్జింగ్ లైట్స్ కోసం చూస్తున్నారా? అయితే, వీటిని ప్రయత్నించొచ్చు. చూడటానికి పాతకాలం రెట్రో లుక్‌లో కనిపించినా.. ఇవి చాలా స్మార్ట్. ముద్దుగా ‘ఎల్ఈడీ టెంట్ లైట్స్’ అని పిలుస్తున్నారు గానీ.. వీటిని ఇంట్లో అనేక అవసరాలకు వాడేయొచ్చు. ఎక్కడైనా హుక్ చేసుకుని హ్యాపీగా పని చేసుకోవచ్చు. వీటిని యూఎస్బీ కేబుల్‌తో రీచార్జ్ చేయొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 8 గంటలపాటు వెలుగుతాయి. ఫుల్ చార్జ్ అవ్వగానే గ్రీన్ లైట్ వెలుగుతుంది. హై, మీడియం, లో.. మోడ్స్‌లో లైటింగ్‌ని సెట్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ ఇంట్లోనే కాకుండా ప్రయాణాల్లోనూ సౌకర్యంగా వాడొచ్చు. ట్రెక్కింగ్ లాంటివి హాబీగా ఉన్నవాళ్లు ఈ లైట్స్‌ని ట్రావెల్ బ్యాగులకు హుక్ చేసుకుని ప్రయాణించొచ్చు.
ధర: రూ.999
దొరికే చోటు: https://l1nq.com/bVnfd