పడకగదిలో ఆ పని ఎన్నిసార్లు చేస్తే అంత మంచిదట..!
Study on Shrungaram: హస్త ప్రయోగం, శృంగారంపై చాలా మందికి చాలా అపోహలుంటాయి. ఎక్కువగా హస్త ప్రయోగం చేయడంవల్ల శృంగార పటిమ తగ్గిపోతుందని

హైదరాబాద్: హస్త ప్రయోగం, శృంగారంపై చాలా మందికి చాలా అపోహలుంటాయి. ఎక్కువగా హస్త ప్రయోగం చేయడంవల్ల శృంగార పటిమ తగ్గిపోతుందని కొందరు ఆందోళన చెందుతుంటారు. అతిగా శృంగారంలో పాల్గొంటే శారీరకంగా బలహీనమై పోతామని మరికొందరు భయపడుతుంటారు. కానీ, తాజా జరిగిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. హస్త ప్రయోగం ఎక్కువగా చేయడంవల్ల, తరచూ శృంగారంలో పాల్గొనడంవల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని, పైగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనంలో తేలింది.
వీలైనంత ఎక్కువ సార్లు అంగస్తంభన జరుగడంవల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు చాలా తగ్గుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. మొత్తం 32 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. నెలలో ఏడు లేదా అంతకంటే తక్కువ సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం చేసేవారితో పోలిస్తే.. 21 సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం చేసేవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు 19 శాతం తక్కువ ఉన్నట్లు గుర్తించారు.
అదేవిధంగా 40 ఏండ్ల వయసువాళ్లు తరుచూ శృంగారం లేదా హస్తప్రయోగం చేస్తే ప్రొస్టేట్ ముప్పు 22 శాతం తక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు. అయితే ఈ విషయంలో ఇదే మొదటి పరిశోధన కాదు. గతంలో ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి అధ్యయనం జరిగింది. సగటున వారానికి 3 కంటే తక్కువ సార్లు హస్తప్రయోగం లేదా శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే.. 7 సార్లు శృంగారం లేదా హస్తప్రయోగం లేదా శృంగారం చేసే వాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు 36 శాతం తక్కువ ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
అయితే అంగస్తంభనకు, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పునకు మధ్య సంబంధంపై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. ఈ రెండింటికి లింకేంటి అనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా పరిశోధన చేసిన శాస్త్రవేత్త జెన్నీఫర్ రైడర్ మాత్రం ఈ రెండింటికి సంబంధం ఉందంటున్నారు. అంగస్తంభన ఫ్రీక్వెన్సీ అనేది పురుషుడి మొత్తం ఆరోగ్యానికి ఓ సూచిక అని చెప్పారు. నెలలో 3 సార్ల కంటే తక్కువగా అంగస్తంభన అయితే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ కాకపోయినా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

