నెలసరి చికాకు?
నా వయసు పాతికేండ్లు. ఇటీవల నెలసరికి ముందు చాలా ముభావంగా ఉంటున్నా. ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నా. కుంగుబాటు, నిరాశ అధికం అవుతున్నాయి. విపరీతమైన చికాకు. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) ఇంత ఇబ్బందికరంగా ఉంటుందా? ఆ తీవ్రత తగ్గించుకునే మార్గం ఉందా?
నా వయసు పాతికేండ్లు. ఇటీవల నెలసరికి ముందు చాలా ముభావంగా ఉంటున్నా. ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నా. కుంగుబాటు, నిరాశ అధికం అవుతున్నాయి. విపరీతమైన చికాకు. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) ఇంత ఇబ్బందికరంగా ఉంటుందా? ఆ తీవ్రత తగ్గించుకునే మార్గం ఉందా?
– ఓ పాఠకురాలు
మీరు చెప్పిన లక్షణాల ఆధారంగా దీన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ డిస్పారిక్ డిజార్డర్’గా చెప్పవచ్చు. ఇది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కంటే భిన్నమైంది. అండం విడుదల తర్వాత శరీరంలో స్రవించే ప్రొజెస్టిరాన్ హార్మోన్ కూడా కొన్నిసార్లు డిప్రెషన్‌కు కారణం అవుతుంది. దానివల్ల మనసు మనసులో ఉండదు. అలసట, చికాకు, నిరాశ కలుగుతాయి. గైనకాలజిస్టును కలిస్తే దీనికి కొన్ని మందులు సూచిస్తారు. అవసరమైతే సైకాలజిస్టునూ సంప్రదించమని సూచిస్తారు. మానసిక నిపుణులు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇస్తారు. తొలి దశలో మందులు వాడకుండానే మనసును ఎలా నియంత్రించుకోవచ్చు అనే విషయంలో తగిన సూచనలు చేస్తారు. అలా కుదరని పక్షంలో ఔషధాలు సిఫారసు చేస్తారు. కాబట్టి, నెలసరికి ముందు తీవ్రమైన చికాకు ఇబ్బంది పెట్టినప్పుడు తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

