అందాన్ని తగ్గించడంలో మొటిమలు ముందుంటాయి. ఇవి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, పడుకునే ముందు చేసే కొన్ని పొరపాట్లు.. ముఖంపై మొటిమలను పెంచుతాయి.
అందాన్ని తగ్గించడంలో మొటిమలు ముందుంటాయి. ఇవి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, పడుకునే ముందు చేసే కొన్ని పొరపాట్లు.. ముఖంపై మొటిమలను పెంచుతాయి. అవేంటో తెలుసుకొని జాగ్రత్తపడితే.. మొటిమలు రాకుండా ఉంటాయి.
దిండు కవర్లను మార్చకపోవడం, శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు వాడటం వల్ల మొటిమలు పెరుగుతాయి. చర్మం నుంచి వచ్చే చెమట, బ్యాక్టీరియా, వివిధ రకాల నూనెలు, మృతకణాలు అన్నీ.. దిండ్లపైనే తిష్ఠవేస్తాయి. వాటిని రోజుల తరబడి మార్చకుండా, శుభ్రం చేయకుండా వాడటం వల్ల.. అవన్నీ చర్మ రంధ్రాల్లోకి చేరుతాయి. ఫలితంగా రంధ్రాలు మూసుకుపోయి మొటిమలకు దారితీస్తాయి.
తలకు నూనె పెట్టుకొని రాత్రంతా పడుకుంటే.. జుట్టుకు మేలు కలుగుతుంది. కానీ, ముఖానికి చేటు తెస్తుంది. కుదుళ్లలోని జిడ్డుదనం.. ముఖ చర్మంపై సీబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.
మేకప్ తొలగించకుండా పడుకున్నా మొటిమలు వస్తాయి. రాత్రంతా మేకప్‌తోనే పడుకుంటే.. అందులోని అవశేషాలు చర్మ రంధ్రాలను మూసేస్తాయి. ఫలితంగా, మొటిమలు ఎక్కువ అవుతాయి.
బెడ్రూమ్లో ఉండే వాతావరణం కూడా ముఖ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. మరీ వేడిగా, మరీ చల్లగా ఉన్నా.. గదిలో జిడ్డుదనం పెరుగుతుంది. ఇది ముఖంపై మొటిమలకు దారితీస్తుంది.