రీస్టోర్.. చేసేద్దామా!?
ఒకప్పుడు ఫొటో దిగడం అంటే.. ఓ ప్రహసనంలా ఉండేది! ఏదో ఓ అరుదైన సందర్భంలోనే కెమెరా‘క్లిక్'మనేది! కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని.. ప్రతి సందర్భం ‘ఫొటో’గా మారిపోతున్నది.
ఒకప్పుడు ఫొటో దిగడం అంటే.. ఓ ప్రహసనంలా ఉండేది! ఏదో ఓ అరుదైన సందర్భంలోనే కెమెరా‘క్లిక్’మనేది! కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని.. ప్రతి సందర్భం ‘ఫొటో’గా మారిపోతున్నది. అయితే అప్పుడప్పుడూ కొన్ని ముఖ్యమైన ఫొటోలు పొరపాటునో.. అనుకోకుండానో డిలీట్ అవుతుంటాయి. ఆ పోగొట్టుకున్న ఫొటోలను తిరిగి పొంది, ఆ పాత మధుర క్షణాలను మళ్లీ నెమరు వేసుకోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి!
ఆండ్రాయిడ్ యూజర్లు అయితే..
- ముందుగా, ‘గ్యాలరీ’లో ఉండే ‘రీసెంట్లీ డిలీటెడ్’ లేదా ‘ట్రాష్’లోకి వెళ్లాలి. ఫోన్ నుంచి డిలీట్ అయిన ఫొటోలన్నీ ఇక్కడికే వచ్చి చేరతాయి. మీకు కావాల్సిన ఫొటోలను ‘సెలెక్ట్’ చేసుకొని, ‘రీస్టోర్ యువర్ ఫైల్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు.
- మీ స్మార్ట్‌ఫోన్‌లో దిగిన ఫొటోలన్నిటినీ గూగుల్ తన ‘ఫొటోస్’లో స్టోర్ చేస్తుంటుంది. ఫోన్లో డిలీట్ అయిన ఫొటోలను ‘గూగుల్ ఫొటోస్’ నుంచి కూడా రీస్టోర్ చేసుకోవచ్చు.
యాపిల్ యూజర్లు అయితే..
- ఐఫోన్లో ‘ఆల్బమ్స్’ను ఓపెన్ చేసి, ‘రీసెంట్లీ డిలీటెడ్’ ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపించే మీ ఫొటోలను సెలెక్ట్ చేసుకొని, ‘రికవర్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. ఫొటోలు తిరిగి ‘ఆల్బమ్’లోకి చేరిపోతాయి.
- ఆండ్రాయిడ్‌లో ‘గూగుల్ ఫొటోస్’లాగానే.. ఐఫోన్లలో ‘ఐక్లౌడ్’ ఉంటుంది. యాపిల్ ఐడీతో లాగిన్ అయితే, మీ ఫొటోలన్నీకనిపిస్తాయి. డిలీట్ అయిన ఫొటోలను ఇక్కడినుంచి తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Photos
- photoshoot
- SMARTPHONE
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

