వరలక్ష్మి.. సిరిలక్ష్మి కూడా! సకల సంపదలకు అధిదేవత అయిన తల్లికి సొమ్ములకు కొదవా? వరాలతల్లి అలంకరణ ప్రియురాలు. తననెంత ముస్తాబు చేస్తే అంత మురిసిపోతుంది. ఎంత చక్కగా సింగారించుకుని పూజకు కూర్చుంటే అంత త్వరగా ప్రసన్నం అవుతుంది. కాబట్టే, వరలక్ష్మీ వ్రతంనాడు అమ్మవారిని అలంకరించడానికి, ఆ తర్వాత తాము ధరించడానికి నెక్లెస్‌లను, చోకర్లను కొనుగోలు చేస్తారు.
అందులోనూ లక్ష్మీదేవి రూపాన్ని ఇమిడ్చిన ఆభరణాలకు శ్రావణంలో మహాగిరాకీ. లక్ష్మీనారాయణులు, అష్టలక్షులు, మహాలక్ష్మి.. ఇలా రకరకాల డిజైన్లలో నెక్లెస్‌లు వస్తున్నాయి. కాసుల హారాలకు.. తరాల నుంచీ అదే ఆదరణ. లక్ష్మీదేవి థీమ్‌తో.. జుంకాలు, నెక్లెస్, వడ్డాణం, గాజులు.. ఇలా మొత్తం సెట్ కూడా లభిస్తున్నది.