చూడ చక్కని రూపం, తీర్చిదిద్దిన ఆకృతి.. ప్రకృతికి ఆధునిక వస్త్రం తొడిగినట్టు ఉంటుంది క్యాథరిన్ థెరీసా అలెగ్జాండర్. నాటి వీర అలెగ్జాండర్ రాజ్యాలను జయిస్తే.. నేటి అందాల అలెగ్జాండర్ మనసులను కొల్లగొడుతున్నది.
దుబాయ్లో పుట్టిన ఈ పీచు మిఠాయికి ఆర్ట్ ఆఫ్ చూజింగ్ బాగా తెలుసు. సినిమాలే కాదు.. వస్ర్తాల ఎంపికలోనూ జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టే, ఓ ఈవెనింగ్ పార్టీకోసం ఈ పీచ్ మిల్క్ కలర్ జార్జెట్ చికంకారీ లాంగ్ ఫ్రాక్ను ఎంచుకుంది.