Fashion | నలుపు తెలుపుల చిరునామా ఎక్కడంటే అమ్మాయిల చేపకళ్లే అని చెబుతాయి. ఆ అందమైన కాంబినేషన్‌కి రంగుల చేపలు జతైతే చెప్పేదేముంది. ఇక, ఆ సౌందర్యాన్ని చూసిన మనసు ఒడ్డున పడ్డ చేపలా గిలగిల్లాడాల్సిందే. ఇక్కడ అమ్మడి భుజం మీద నుంచి జాలువారిన జార్జెట్ చీర ఆ అందానికి అద్దం పడుతున్నది. దానికి జతగా బోట్‌నెక్, బెల్ స్లీవ్స్ ఉన్న శాటిన్ రవిక చీర కట్టుకు ఫ్యాషన్ లుక్‌ని కట్టబెడుతున్నది.
సమతా చౌదరి, డిజైనర్
Samatha Chowdary@wowostudios