అచ్చెరువొందించే రంగు రంగుల అందమైన పెయింటింగ్స్ కాంగ్రా ఆర్ట్ ప్రత్యేకం. ఆ చిత్తరువుల సోయగాలను అమ్మాయిలు ధరించే ట్రౌజర్స్ సెట్‌కి జోడించింది సుకేత్ ధీర్ సంస్థ. వైట్ గోల్ఫర్ బ్రొకేడ్ సెట్ పేరిట తెలుపు రంగు పట్టు జరీనేత వస్త్రం మీద కాంగ్రా బొమ్మలు కనువిందు చేసేలా దీన్ని రూపొందించారు. రెండు వైపులా పాకెట్స్ వచ్చే బ్లేజర్, బూట్‌కట్ ట్రౌజర్‌తో ఈ సెట్‌ను తయారుచేశారు. మహారాజులు, మహారాణులు గోల్ఫ్ ఆడుతున్నట్టు, సెల్ఫీలు తీసుకుంటున్నట్టు, బండి నడుపుతున్నట్టుగా తీర్చిదిద్దిన కాంగ్రా తరహా పెయింటింగ్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. హుందాగా కనిపిస్తూనే ట్రెండీ లుక్‌ని తీసుకువచ్చే ఈ సెట్‌ని కొనుక్కోవాలంటే suketdhir.com వెబ్సైట్లోకి వెళ్లాలి. ధర సుమారు లక్ష రూపాయలు.
మగువ తనువును మోస్తూ అణువణువూ పరవశించేవి పాదరక్షలే! అందుకే కాబోలు, తమ అడుగులకు మడుగులొత్తే జోళ్లకు అతివలు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇంతుల సంగతి తెలిసిన వ్యాపార సంస్థలు రకరకాల పాదరక్షలను విభిన్న డిజైన్లలో తీర్చిదిద్ది విపణిలోకి విడుదల చేస్తుంటాయి. ‘ఒదీనా’ 65 ప్లాట్‌ఫామ్ సాండల్స్ అలా వచ్చినవే! ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ క్లోవి క్రియేటివ్ డైరెక్టర్ గాబ్రియెల్ హార్ట్స్ పదిహేడేండ్ల వయసులో గీసిన స్కెచ్ ఆధారంగా ఒదీనా సంస్థ వీటిని తీర్చిదిద్దింది. రెట్రో స్పెషల్‌గా రూపుదిద్దుకున్న ఈ సాండల్స్‌తో కంఫర్ట్‌తోపాటు రిచ్ లుక్‌నూ సొంతం చేసుకోవచ్చు. మూడున్నర అంగుళాల ఎత్తును పెంచే ఈ సాండల్స్ ధర సుమారు రూ.70 వేలు. www.matchesfashion.com వెబ్సైట్ ద్వారా ఈ రెట్రో స్పెషల్ సాండల్స్ కొనుగోలు చేయొచ్చు.
సాధారణంగా హ్యాండ్ బ్యాగులంటే నలుపు, బ్రౌన్ రంగులను ఎక్కువగా వాడతాం. కానీ నల్లదనానికి ఏమాత్రం తీసిపోని అందం తెలుపు బ్యాగులకూ ఉంటుందని నిరూపించేలా ఉంది ఏఎంపీఎం సంస్థ రూపొందించిన ఈ హ్యాండ్ బ్యాగు. మేలిమి ముత్యపు రంగులో.. దారాలను కుడుతూ ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించారు. ఎక్కడ పెట్టినా బ్యాగుతోపాటు పైన హ్యాండిల్ కూడా నిలబడి ఉండేలా తయారుచేశారు. ‘మినిమలిజం’కు మారుపేరైన ఏఎంపీఎం సంస్థ.. నెసర బకెట్ బ్యాగ్ పేరిట దీన్ని రూపొందించింది. Ampm.in వెబ్సైట్లో దొరుకుతుంది. ధర రూ.12,950.
గాజులంటే ఆడవాళ్లకెంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. మట్టివీ, బంగారువీ, రాళ్లవీ, పూసలవీ.. ఇలా ఎన్ని రకాలున్నా, మ్యాచింగుల పేరుతో మళ్లీ మళ్లీ కొంటుంటారు. వాళ్ల ఇష్టానికి తగ్గట్టు బ్రేస్లెట్లు కూడా బ్యాంగిల్ బ్రేస్‌లెట్లుగా ముస్తాబవుతుంటాయి. అదే కోవలో కనక పుష్యరాగం, వజ్రాలు కలగలిపి నాజూకైన బ్యాంగిల్ బ్రేస్‌లెట్‌ను రూపొందించింది అనన్య మల్హోత్రా క్రియేషన్స్. మన శరీరంలోని షట్చక్రాలలో ప్రవహించే శక్తిని ప్రతిబింబించేలా ఇందులోని డిజైన్‌ను రూపొందించారు. దాదాపు మూడు లక్షల రూపాయల ఖరీదు చేసే ఈ బ్రేస్‌లెట్‌ను net-a-porter.com లో కొనుగోలు చేయొచ్చు.