జ్యూట్ సిల్క్, పెన్ కలంకారీ లెహంగా చోలీ.. పార్టీలూ ఫంక్షన్లలో కనికట్టు చేస్తుంది. లెహంగా దాదాపుగా లాంగ్ స్కర్ట్‌ను తలపిస్తుంది. కాకపోతే కళాత్మకమైన పనితనం తోడైంది. సిల్కు దారాల హ్యాండ్ ఎంబ్రాయిడరీ.. ఏ గాజుల చేతులు చేసిన అద్భుతమో కావచ్చు. చోలీ రూపకల్పనలోనూ సృజనాత్మకమైన కసరత్తు కనిపిస్తున్నది.