అనుభవాన్ని మించిన బిజినెస్ ఐడియా ఉండదేమో. అప్పటికి ఆష్నీ షాకు ఇరవై నిండాయి. లండన్లో ఫిల్మ్ మేకింగ్ చదువుతున్నది. అంతలోనే తన పెండ్లి కుదిరింది. ‘షాపింగ్ కోసం ఇండియా వెళ్లడం ఎందుకు? ఇక్కడే కొనేద్దాం’ అనుకుంది. కానీ లండన్ వీధులన్నీ తిరిగినా భారతీయ డిజైనర్ వస్ర్తాలు కనిపించలేదు. దీంతో ముంబై విమానం ఎక్కాల్సి వచ్చింది.
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కంపెనీ.. సబ్యసాచి స్టోర్లో షాపింగ్ చేయాల్సి వచ్చింది. వివాహ వేడుకలు పూర్తికాగానే ఆమె చేసిన మొదటి పని.. లండన్లోని నాటింగ్ హిల్స్ ప్రాంతంలో ఆష్నీ అండ్ కో పేరుతో ఇండియన్ బ్రైడల్ బొటిక్ ప్రారంభించడం. తొలి రోజుల్లో చాలా ఇబ్బందులే పడింది. ఆత్మవిశ్వాసంతో ప్రతి సవాలునూ ఎదుర్కొంది. మొత్తానికి వ్యాపారంలో నిలదొక్కుకుంది. ఇప్పుడు, తాను తొలుత షాపింగ్ చేసిన ముంబై మహానగర వీధుల్లోనూ ఆష్నీ అండ్ కో బొటిక్ తెరిచింది. నయాపైసా అప్పు చేయకుండా.. వ్యాపారాన్ని ప్రారంభించడం, విస్తరించడం తన ప్రత్యేకత.