సామర్థ్యం ఉన్నా ఆ కోరికలు సన్నగిల్లాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Special news | వృద్ధాప్యంలో శృంగార కోరికలు తగ్గడం సహజమే..! కానీ, కొంతమందిలో వృద్ధాప్యం ధరిచేరకముందే శృంగార కోరికలు తగ్గిపోతాయి..! అంటే శృంగార సామర్థ్యం ఉంటుంది కానీ ఆసక్తిని కోల్పోతారు..!
శృంగారం అనేది సృష్టికార్యం..! దాంపత్య బంధంలో అత్యంత కీలక ఘట్టం..! ఆలుమగలు శృంగారాన్ని ఎంత ఆస్వాదిస్తే వారి బంధం అంత బలంగా ఉంటుంది..! అయితే వయసులో ఉన్నప్పుడు అందరూ శృంగారాన్ని ఎంజాయ్ చేయగలిగినా వయసు మీదపడుతున్నా కొద్దీ కోరికలు సన్నగిల్లుతాయి..! వృద్ధాప్యంలో శృంగార కోరికలు తగ్గడం సహజమే..! కానీ, కొంతమందిలో వృద్ధాప్యం ధరిచేరకముందే శృంగార కోరికలు తగ్గిపోతాయి..! అంటే శృంగార సామర్థ్యం ఉంటుంది కానీ ఆసక్తిని కోల్పోతారు..! నలభైల తర్వాత బరువు బాధ్యతలు మీద పడటంతో శృంగారం గురించి ఆలోచించే సమయం ఉండదు..! ఆలోచనలు తగ్గడంతోపాటే కోరికలు కూడా తగ్గుతూ వస్తాయి..! కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే కావాల్సినంత సమయం కేటాయిస్తుండాలి..! కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించాలి..! మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..?
మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలి
పిల్లలు పెరిగి పెద్దయ్యేసరికి దంపతులిద్దరి ఆలోచనా తీరు ఒకేలా ఉంటుంది. పిల్లల భవిష్యత్తే కండ్లముందు కదలాడుతుంది. దానికితోడు అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. దాంతో క్రమంగా శృంగారంపట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇలా తగ్గిపోయిన ఆసక్తి మళ్లీ పెరుగాలంటే మానసిక సన్నద్ధత చాలా ముఖ్యం. కాబట్టి అప్పుడప్పుడూ శృంగారం గురించిన ఆలోచనలు చేస్తుండాలి. ఇద్దరికీ అనుకూలమైన సమయం చూసి.. పెండ్లయిన కొత్తలో శృంగారాన్ని ఎలా ఆస్వాదించేవాళ్లం..? ఎలాంటి ఊసులు చెప్పుకునేవాళ్లం..? అనేవి గుర్తుచేసుకోవాలి. ఆ ఆలోచనలు మదిలో మెదలగానే కోరికలు గుర్రాలవడం ఖాయం. దంపతులిద్దరిలో ఒక్కరు ఇలా సిద్ధమైతే చాలు.. అవతలి వ్యక్తిని అవలీలగా దారిలోకి తెచ్చుకోవచ్చు.
ఫోర్ ప్లేను విస్మరించవద్దు
చాలామంది శృంగారం అంటే శారీరక కలయికే అనుకుంటారు. కానీ దానికి ముందుచేసే ఫోర్ ప్లే కూడా శృంగారంలో భాగమే. భాగస్వాములిద్దరూ శృంగార అనుభూతులను ఆసాంతం అనుభవించాలంటే ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఫోర్ ప్లే అనేది శృంగారంలో మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆలుమగల మధ్య ప్రేమను మరింత పెంచడంలో దోహదపడుతుంది. ఎందుకంటే ఫోర్ ప్లే ఎక్కువసేపు చేయడంవల్ల ఇద్దరిలోనూ సెక్స్ హార్మోన్స్ పూర్తిగా విడుదలవుతాయి. ఇలా హార్మోన్లు పూర్తిగా విడుదలవడంవల్ల శృంగారాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు. కాబట్టి ఎంత ఎక్కువసేపు ఫోర్ ప్లే చేయగలిగితే అంత ఎక్కువ అనుభూతి చెందవచ్చు.
చీకట్లో శృంగారాన్ని మానుకోండి
చాలామంది శృంగారం సమయంలో లైట్లు ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం కరెక్టు కాదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఇలా ఒకరినొకరు చూసుకోకుండా శృంగారంలో పాల్గొంటే రానురాను దానిపట్ల ఆసక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శృంగారంలో పాల్గొనేటప్పుడు లైట్లు వేసుకుని, ఒకరినొకరు కళ్లల్లో కళ్లుపెట్టి చూసుకుంటే మంచి అనుభూతి కలుగుతుందంటున్నారు. ఇలా శృంగారంలో ఒకరినొకరు తనివితీరా చూసుకోవడంవల్ల ఆ జ్ఞాపకాలు మధుర స్మృతులుగా మిగిలిపోతాయని, అవసరమైనప్పుడు ఆ స్మృతులను గుర్తుకు తెచ్చుకోగానే కోరికలు పురివిప్పుతాయని చెబుతున్నారు.
భంగిమల్లో మార్పులు చేస్తుండాలి
కొన్ని పనులు ఎప్పుడూ ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది. శృంగారం కూడా అలాంటిదే. అందుకే తరచూ శృంగార భంగిమలను మార్చాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు. తరచూ భంగిమలను మార్చడం ద్వారా కొత్తకొత్త అనుభూతులు కలుగుతాయని, ఇలా ఎప్పటికప్పుడు నూతన అనుభూతులను ఆస్వాదించడం ద్వారా శృంగారంపై కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రాచీన గ్రంథం కామసూత్రలో శృంగారానికి సంబంధించి కావాల్సినన్ని భంగిమలు ఉన్నాయని, అయితే వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిలో అనువైన భంగిమలను ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

