Home
Lifestyle
Ghee Can Be Served Not Only In A Plate But Also In A Bowle It Is Also Good For Plants
మొక్కలకూ నెయ్యి
నెయ్యి మన ఆహార సంప్రదాయంలో భాగం. మితంగా తీసుకుంటే ఒంటికి కావాల్సిన మంచి కొవ్వు అందుతుందని వైద్యులు చెబుతారు.
నెయ్యి మన ఆహార సంప్రదాయంలో భాగం. మితంగా తీసుకుంటే ఒంటికి కావాల్సిన మంచి కొవ్వు అందుతుందని వైద్యులు చెబుతారు. పళ్లెంలోనే కాదు, కుండీలోనూ నెయ్యి వడ్డించవచ్చు. ఇది మొక్కలకూ మంచిదే.
- రెండు మూడు నెలలకు ఒకసారి కుండీలో వేసే ఎరువు లేదా మట్టిలో చెంచాడు నెయ్యి కలిపితే మట్టి సారవంతం అవుతుందట.
- పురుగూపుట్రా మొక్కలను ఆశించినప్పుడు, కరిగించిన నెయ్యిలో ముంచిన దూదితో ఆకులు, కొమ్మలకు రాస్తే.. చీడపీడలకు పట్టు చిక్కదు. మొక్క ఎండలో ఉన్నప్పుడు మాత్రం ఈ చిట్కా పనిచేయదని హెచ్చరిస్తారు నిపుణులు.
- తరచూ నెయ్యి చిలకరించడం వల్ల మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతాయి కూడా.
- రబ్బరు చెట్టు లాంటి మొక్కల ఆకులు ఎక్కువ రోజులు మెరుస్తూ ఉండాలంటే వాటిని నేతిలో అద్ది తీసిన దూదితో తుడవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేతికి ఉండే జిడ్డు స్వభావం వల్ల.. దాన్ని మొక్కలకు నేరుగా రాసినప్పుడు, దుమ్ము పేరుకుపోయే ఆస్కారం ఉంది. కాబట్టి, ఓ నాలుగు రోజుల తర్వాత మెత్తటి గుడ్డతో శుభ్రం చేయాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

