నెత్తిన పాపిటబిళ్ల మెరుపు. నాసికానికి ముక్కెర మురిపెం. చెవులకు లోలాకుల సింగారం. మెడకు ఏడువారాల వైభోగం. పిడికెడు నడుముకు జానెడు వడ్డాణం. అద్దంలా ముద్దొచ్చే వీపు మాత్రం ఏం పాపం చేసుకుంది! అందుకే ఓ డిజైనర్, కలికి వెన్నుభాగం కోసం అందమైన పోల్కీ ఆభరణాన్ని డిజైన్ చేశారు. ఆ ముస్తాబులో ఆమెను కనుక చూస్తే… ‘నీ వెనకే నేనుంటా?’ అంటూ ప్రేమికుడు దాసానుదాసుడిలా అనుసరించాల్సిందే!