మేరా టైమ్ ఆయేగా..
సమయానికి తగిన ఫ్యాషన్ కోరుకుంటారు ఎవరైనా. కానీ, ఫ్యాషన్ మాత్రం సమయంతో సై అంటే సై అని పోటీ పడుతుంది. కాలమంత వేగంగా మారిపోతూ ఉంటుంది. ఆ దూకుడును ప్రతిబింబిస్తూ.. పరిగెత్తే సమయాన్ని పడతులు ఇష్టపడే ఆభరణాల్లో పొందుపరుస్తున్నారు డిజైనర్లు. ‘వాచ్ ఇన్స్పైర్డ్ జువెలరీ’ ట్రెండీ ఆభరణాల జాబితాలో చేరిపోతున్నది.

పట్టు చీర కట్టాలంటే ఒక టైమ్ ఉండాలి. నగలు పెట్టుకోవాలంటే సందర్భం కావాలి. జీన్సుకూ వేళాపాళా అవసరమే. కానీ వీటన్నిటినీ టైమ్‌కు తగ్గట్టు ఫాలో కావాలంటే.. మన దగ్గర వాచ్ ఉండాలి. అది చేతికే ఉండాలా.. మెడలో ఉండకూడదా.. చెవి దుద్దుగా అమరిపోకూడదా.. వేలి ఉంగరంలో ఇమిడిపోకూడదా? కాబట్టే, ఫ్యాషన్ వస్తువులా రూపొందించారు డిజైనర్లు.
ముద్దుగుమ్మ చెవికి అందాల కమ్మగా, నాజూకైన వేలికి ముద్దులొలికే అంగుళీకంలా, సింగారాల మెడలో బంగారు లాకెట్‌లా.. వాచీలు దర్శనమిస్తున్నాయి. సౌందర్యంతో కనికట్టు చేసి ఎదుటివాళ్లు కాలాన్ని మరచిపోయేలా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మగువలు మెచ్చేలా రంగురంగుల్లో దొరుకుతున్నాయి. ఉంగరాల విషయానికొస్తే.. అన్ని సైజుల వేళ్లకూ సరిపోయేలా రూపొందుతున్నాయి. అమెజాన్‌లాంటి వెబ్సైట్లలో కూడా దొరుకుతున్నాయీ గడియారం నగలు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!