‘గర్భిణి’ అని తెలియగానే.. ఆమె ప్రపంచమంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోతుంది.అదే సమయంలో అందం.. ముఖ్యంగా చర్మ సంరక్షణపై అశ్రద్ధ కనిపిస్తుంది. అయితే.. ఈ సమయంలో చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే.. లేనిపోని సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
గర్భధారణ సమయంలో మహిళల చర్మంలో అనేక మార్పులు సంభవిస్తాయి. కాబట్టి సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం ఎంతో ముఖ్యం. గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్మ సంరక్షణ చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.