గట్ హెల్త్ మీ చేతుల్లో
శరీరంలో గుండె, మెదడు ఎంత ముఖ్యమో జీర్ణవ్యవస్థ కూడా అంతే ప్రాధాన్యం కలినది అంటున్నారు వైద్యులు. ఈ రోజుల్లో దేశంలో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘గట్ హెల్త్'. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
శరీరంలో గుండె, మెదడు ఎంత ముఖ్యమో జీర్ణవ్యవస్థ కూడా అంతే ప్రాధాన్యం కలినది అంటున్నారు వైద్యులు. ఈ రోజుల్లో దేశంలో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘గట్ హెల్త్’. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. శక్తి స్థాయులు తగినంత శరీరంలో ఉండటానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని అరిగించడానికి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తిని అదుపులో ఉంచేందుకూ సాయపడుతుంది. ఆహారం అరగడంలో సమస్యలు, ఊబకాయం, ఆందోళన వంటి సమస్యలు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తాయి.
గట్ హెల్త్ అనేది ఫుడ్పైన మాత్రమే కాదు మన అలవాట్లపైనా ఆధారపడి ఉంటుంది. రాత్రి 9 దాటాక తినడం, విపరీతమైన ఆందోళన, డీహైడ్రేషన్, నిద్రలేమి, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వంటి అలవాట్లు జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చిన్న చిన్న అలవాట్లు దినచర్యలో చేర్చుకుంటే గట్హెల్త్ను ఇంటినుంచే మెరుగుపరుచుకోవచ్చు. తద్వారా మెదడు చురుకుగా పనిచేయడంతోపాటు ఊహించనిదానికంటే మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
జీర్ణవ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి ఖరీదైన సప్లిమెంట్స్ వాడాల్సిన పనిలేదు. పెద్దపెద్ద డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరంలేదు అంటున్నారు డైటీషియన్లు. మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోశ, పెరుగు, పెసరపప్పు కిచిడీ, అరటిపండు, రాజ్మా, పెసరపప్పు, కందిపప్పు వంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ మనం వండుకోదగ్గవే. వీటితో పాటు పులియబెట్టిన ఆహారాన్ని, తగినంత నెయ్యిని కూడా చేర్చుకోవడం వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

