ఆవు పాలకి, బర్రె పాలకి మధ్య తేడా ఏంటి?

పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు. అయితే, ఇక్కడే ఓ సమస్య! మన ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? బర్రె పాలు మంచివా? ఇది చాలామందిలో వచ్చే సందేహమే. అసలు ఆవు పాలకు, బర్రె పాలకు మధ్య తేడా ఏంటో ఒకసారి చూద్దాం..
కొవ్వు శాతం
పాలల్లో ఉండే కొవ్వుపై వాటి చిక్కదనం ఆధారపడి ఉంటుంది. ఆవు పాలల్లో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. అదే బర్రె పాలల్లో 7-8 శాతం వరకు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బర్రె పాలు చిక్కగా ఉంటాయి. దీనివల్ల బర్రెపాలు అరగడానికి కాస్త సమయం పడుతుంది.
ప్రోటీన్లు
ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఎక్కువగా వేడి నిరోధకతను కలిగి ఉంటాయి. అందుకే నవజాత శిశువులు, వృద్ధులకు బర్రె పాలు తాగించొద్దని చెబుతుంటారు.
కొలెస్ట్రాల్
ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఊబకాయం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారు ఆవు పాలకు బదులు బర్రె పాలు తాగడం మంచిది.
కేలరీలు
ఆవుపాలతో పోలిస్తే బర్రె పాలల్లోనే కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలతో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక గ్లాస్ బర్రె పాలల్లో 237 కేలరీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాలల్లో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి.
నిల్వ సమయం
బర్రె పాలల్లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలు ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి. ఆవు పాలను రెండు రోజులలోపే తాగాలి.
రంగు
ఆవు పాలు పసుపు, తెలుపు రంగులో ఉంటాయి. అదే బర్రె పాలు తెలుపు, క్రీమ్ కలర్లో ఉంటాయి. బర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విటమిన్ ఏగా మారుతుంది. అందుకే బర్రె పాలల్లో పసుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ తక్కువ మోతాదులో మాత్రమే ఉంటుంది.
ఉపయోగం
మంచి నిద్ర పోవాలంటే రాత్రి పూట బర్రె పాలు తాగడం మంచిది. కోవా, పెరుగు, నెయ్యి, పన్నీర్, పాయసం వంటివి చేయడానికి బర్రె పాలు మంచివి. అదే ఆవు పాలల్లో తక్కువ క్రీమ్ ఉంటుంది కాబట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉపయోగించవచ్చు.
ఆవు పాలు, బర్రె పాల మధ్య తేడా ఉన్నప్పటికీ ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మన అవసరాలను బట్టి ఆవు పాలు కావాలా, బర్రె పాలు కావాలా అన్నది నిర్ణయించుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- buffalo milk
- Cow milk
- Food
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

