అవసరం ఆవిష్కరణకు అమ్మలాంటిదని అంటారు. ప్రతి ఆవిష్కరణ వెనుకా ఓ అవసరం ఉంటుంది. నిజానికి, ఆ అవసరం పురుషుడి కంటే మహిళకే ఎక్కువ. కుటుంబ వ్యవస్థ అంటూ ఏర్పడని కాలంలో.. పాపం ఆమెకెన్నిఅవసరాలు? పిల్లల ఆకలి తీర్చాలి, అనారోగ్యాలను దూరం చేయాలి, క్రూరమృగాల నుంచి రక్షించాలి.. అలా ఆమె చేతుల మీదుగానే సేద్యం, వైద్యం, ఆయుధం పుట్టి ఉంటాయి. కాబట్టే, స్త్రీని తొలి శాస్త్రవేత్తగా గుర్తించాలి. కానీ ఆవిష్కరణల రంగంలో ఆమెకు దక్కాల్సిన గౌరవం, లభించాల్సిన మర్యాద, వరించాల్సిన పురస్కారం..
ఆమడంత దూరంలోనే ఉండిపోయాయి. నాసా నుంచి ఇస్రో వరకూ.. ప్రతిచోటా ఆమె ప్రాధాన్యం పెరగాలి. వైద్యం నుంచి వ్యవసాయం వరకు.. అన్ని పరిశోధనల్లో ఆమె పాత్ర విస్తరించాలి. ఆ దిశగా జరిగింది కొంత. జరగాల్సింది కొండంత. ఈ అగాధాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఫిబ్రవరి 11ను ‘ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆమెకు పెద్దపీట వేయడం, ఇప్పటికే ఉన్నవారిని మనసారా అభినందించడం మన బాధ్యత అంటున్నది ఐరాస. బాలికల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచగలిగితే.. వారిలో హేతువాద దృక్పథం అలవడుతుంది. మూఢాచారాలను అధిగమిస్తారు. కుటుంబాన్ని సైన్స్ పరివారంగా తీర్చిదిద్దుతారు.
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?