బుల్లితెర మీద వెలుగులీని వెండితెరకు ఎగబాకిన కథానాయికల్లో అవికా గోర్ ఒకరు. చిన్నారి పెళ్లికూతురుగా అటు హిందీ ప్రేక్షకులకూ ఇటు తెలుగు వీక్షకులకూ దగ్గరైంది. తెలుగుతనం ఉట్టిపడేలా ఆకుపచ్చ చుడీదార్లో మెరిసి పోతున్నదీ ముద్దుగుమ్మ. బంగారు రంగు జరీ పోగులతో, అదే వర్ణపు చమ్కీలు కలిపి చేసిన ఎంబ్రాయిడరీతో దీన్ని అలంకరించారు. మోచేతుల దాకా వచ్చిన స్లీవ్స్‌తో పాటు ప్యాంటు అంచుకూ కుట్టుపని చేశారు. ఇక నాజూకైన బ్రేస్‌లెట్‌ను పోలిన టాటూ, తెల్లరాయి పొదిగిన ఉంగరాలు చేతి అందాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. మ్యాచింగ్ బొట్టు, తెలుపు-ఎరుపు పూసల జుంకాలతో తన లుక్‌ను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుకుందీ..‘పాప్‌కార్న్’ సుందరి.
సి.ఎం. ప్రవీణ్