పాలు తాగుతున్నారా?
సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే పౌష్టిక ఆహారాల్లో ఒకటి పాలు. వయసుతో సంబంధం లేకుండా మన దేశంలో ఎక్కువ మంది పరగడుపున, రాత్రి పడుకునే ముందు పాలు తాగుతుంటారు. పెరుగు, వెన్న, పనీర్ లాంటి పాల ఉత్పత్తుల వాడకమూ ఎక్కువే.
సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే పౌష్టిక ఆహారాల్లో ఒకటి పాలు. వయసుతో సంబంధం లేకుండా మన దేశంలో ఎక్కువ మంది పరగడుపున, రాత్రి పడుకునే ముందు పాలు తాగుతుంటారు. పెరుగు, వెన్న, పనీర్ లాంటి పాల ఉత్పత్తుల వాడకమూ ఎక్కువే. ఇక టీ, కాఫీల్లో పాలదే ప్రథమ స్థానం. ఎంత చిక్కటి పాలు కలిపితే అంత రుచి అంటూ చిక్కటి టీ, కాఫీలు లాగిస్తుంటారు భారతీయులు. అయితే పాలల్లో అపారమైన పోషకాలు ఉండే మాట వాస్తవమే అయినప్పటికీ అందులోని లాక్టోజ్ని అరిగించడానికి ఉపయోగపడే లాక్టేజ్ స్థాయిలు కొందరిలో తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి పాలు తాగడం వల్ల ఫలితం అందకపోగా, ఉబ్బరం, విరేచనాలు, వికారం, వాంతులు తదితర సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
మనం తాగే పాలను అరిగించుకోవడానికి మన చిన్నపేగులో విడుదలయ్యే లాక్టేజ్ ఉపయోగపడుతుంది. కానీ, కొంతమందిలో ఈ ఎంజైమ్ ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల వారికి పాలు జీర్ణసంబంధ ఇబ్బందుల్ని కలిగిస్తాయి. పాలల్లోని లాక్టోజ్ని విచ్ఛిన్నం చేయడానికి లాక్టేజ్ అవసరం. దీనిని కిణ్వ ప్రక్రియ అంటారు. పాలు తాగడం వల్ల అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కొనేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.
పాలను హరాయించుకునే శక్తిలేని వ్యక్తులు డెయిరీ ఉత్పత్తులకు బదులు బాదం, సోయా, ఓట్ మిల్క్ వంటి వాటిని ప్రయత్నించవచ్చు. పెరుగు, పనీర్ వంటి పులిసిన డెయిరీ పదార్థాలను తినడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడవు. వైద్యుల సలహాతో పాల ఉత్పత్తులు తీసుకునే ముందు లాక్టేజ్ ఎంజైమ్ సప్లిమెంట్స్‌ని తీసుకోవచ్చు. డెయిరీ ఉత్పత్తులు తీసుకున్నప్పుడు తరచుగా అజీర్ణం, విరేచనాలు, వికారం, వాంతులు వంటి సమస్యల్ని ఎదుర్కొంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

