ఏఐతో ఆగమాగం కావొద్దు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు మన దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆఫీస్ ఈమెయిళ్లు రాయడం, ప్రాజెక్ట్ నోట్స్ తయారు చేయడం, ప్లాన్లు వేసుకోవడం నుంచి సృజనాత్మక ఆలోచనల వరకు ప్రతీదానికి చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇవి ఉత్పాదకతను విపరీతంగా పెంచినా మరోవైపు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాడీ వ్యవస్థ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు మన దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆఫీస్ ఈమెయిళ్లు రాయడం, ప్రాజెక్ట్ నోట్స్ తయారు చేయడం, ప్లాన్లు వేసుకోవడం నుంచి సృజనాత్మక ఆలోచనల వరకు ప్రతీదానికి చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఇవి ఉత్పాదకతను విపరీతంగా పెంచినా మరోవైపు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాడీ వ్యవస్థ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ పనుల నుంచి మానసిక ప్రశాంతత వరకు ప్రతీదానికి చాట్‌బాట్స్‌పై ఆధారపడటం వల్ల మనుషులు స్వయం ఆలోచనా శక్తిని కోల్పోతున్నారు. క్రమంగా ఇది ఒక రకమైన మానసిక సమస్యకు దారితీస్తున్నది. ఏఐని పని సులభతరం చేసే సాధనంగా వాడటంలో తప్పు లేదు. కానీ, సొంతంగా ఆలోచించే శక్తిని, భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యాన్ని, తోటి మనుషులతో సంబంధాలను ఏఐతో భర్తీ చేయడమే అసలైన ప్రమాదం.
ఆత్మవిశ్వాసం కోల్పోవడం: ఏఐకి బానిసవుతున్నారని చెప్పడానికి మొదటి సంకేతం ఆత్మవిశ్వాసం తగ్గడం. చిన్నచిన్న విషయాల్లో కూడా ఏం ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై ఏఐని సంప్రదిస్తుంటారు. ఈ ధోరణి మెదడు స్వతంత్ర విశ్లేషణా శక్తిని బలహీనపరుస్తుంది.
బాధలు చెప్పుకోవడం: బాధ, ఒత్తిడి, ఏకాంతం ఆవహించినప్పుడు తోటి మనుషులు, స్నేహితులతో కాకుండా చాట్ బాట్స్‌తో మాట్లాడుతుంటారు. కానీ, వాటికి నిజమైన మానవ సానుభూతి, భావోద్వేగాలు ఉండవు. మనుషులను కాదని డిజిటల్ సాధనాలతో ఉద్వేగాలను పంచుకోవడం వల్ల వ్యక్తిగతంగా మరింత ఒంటరితనం పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన: సర్వర్ డౌన్ కావడం వల్లో, మరే ఇతర కారణంగానో చాట్‌బాట్ ఓపెన్ కాకపోతే.. తీవ్రంగా ఆందోళన చెందుతున్నారంటే మానసికంగా చాలా పెద్ద సమస్యలో ఉన్నట్టే! సాంకేతికత అనేది సౌకర్యం కోసం ఉండాలి కానీ, మీ మనసును ఆగమాగం చేసేదిలా మారకూడదు.
సంభాషణ నివారించడం: తోటి మనుషులతో మాట్లాడేటప్పుడు వారి హావభావాలు, శరీర భాష, ఉద్వేగాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏఐతో మాట్లాడేటప్పుడు ఎలాంటి మానసిక శ్రమ అవసరం ఉండదు. దీనితో చాలామంది ప్రత్యక్ష సంభాషణలను నివారించి కృత్రిమ చాటింగ్‌కే పరిమితమవుతారు. ఇది రోజు రోజుకూ సామాజిక సంబంధాలను దెబ్బతీస్తున్నది.
జీవితం దెబ్బతింటుంది: నైపుణ్యాలు పెంచుకోవడం పకనబెట్టి గంటల తరబడి ఏఐ చాట్‌బాట్స్‌తో కాలక్షేపం చేయడం, నిద్ర, ఉద్యోగం, చదువు వంటి నిత్యకృత్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటే.. మీరు ఏఐ వ్యసనంలో కూరుకుపోయినట్టే అని భావించక తప్పదు. ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నా చాట్‌బాట్స్‌ను వదల్లేకపోవడం ప్రవర్తనా నియంత్రణను కోల్పోతున్నారనడానికి నిదర్శనం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

