ఆమె మనసు సున్నితం. ఆలోచనలు అతి సున్నితం. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందిస్తుంది. ఎవరు సమస్యల్లో ఉన్నా ఆదుకుంటుంది. సానుభూతి చూపిస్తుంది.
కన్నీళ్లూ కురిపిస్తుంది. అలాంటిది, ఏకంగా భూగోళం భగభగమంటుంటే గుండె మండకుండా ఉంటుందా? అందుకే, పర్యావరణం పట్ల తన ప్రేమను చాటుతూ ఓ మాడల్ చెత్తపాలైన డబ్బాలనే తన ఆచ్ఛాదనగా మలుచుకున్నది.