3D Printed T-Shirts | కుక్క ఉన్నట్టు చొక్కా కనికట్టు!
3D Printed T-Shirts | ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనికట్టు చేయడం త్రీడీకి అలవాటే. ఆ కళ ఇప్పుడు చొక్కా మీదకెక్కింది. కుక్కలూ, పిల్లులూ, పక్షుల్లాంటి రకరకాల ప్రాణులకు టీ షర్ట్ క్యాన్వాసు మీద ఊపిరిపోస్తున్నది. ఆ ప్రాణులు అక్కడే ఉన్నాయా అనిపించేంతచిత్రంగా రూపొందుతున్నాయి ‘యానిమల్ త్రీడీ ప్రింటెడ్' టీ షర్టులు. క్యాజువల్ డ్రెస్‌నే కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకునేవారు వీటిని ధరించవచ్చు.
3D Printed T-Shirts | ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనికట్టు చేయడం త్రీడీకి అలవాటే. ఆ కళ ఇప్పుడు చొక్కా మీదకెక్కింది. కుక్కలూ, పిల్లులూ, పక్షుల్లాంటి రకరకాల ప్రాణులకు టీ షర్ట్ క్యాన్వాసు మీద ఊపిరిపోస్తున్నది. ఆ ప్రాణులు అక్కడే ఉన్నాయా అనిపించేంతచిత్రంగా రూపొందుతున్నాయి ‘యానిమల్ త్రీడీ ప్రింటెడ్’ టీ షర్టులు. క్యాజువల్ డ్రెస్‌నే కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకునేవారు వీటిని ధరించవచ్చు.

చాలా మంది పిల్లులూ కుక్కల్ని అమితంగా ప్రేమిస్తారు. ఆత్మీయుల్లా చూస్తారు. అంతేకాదు, పప్పీ మెప్పు పొందాలనీ, కిట్టీకి పెట్టీగా ఉండాలనీ ఆశపడతారు. అవి కూడా పిల్లలకు మించి చనువు తీసుకుంటాయి. మరికొందరికేమో పక్షులంటే ప్రాణం. ఇంకొందరు ఊసరవెల్లుల్లాంటి చిత్రమైన జీవుల్నీ పెంచుకుంటారు. ఇలా మూగ ప్రాణుల మీద జనానికున్న అభిమానాన్ని గమనించిన డిజైనర్లు నిజమైన ప్రాణుల్ని తమతో పాటు ఉంచుకున్నట్టు కనిపించేలా చొక్కాలపై వాటిని ముద్రిస్తున్నారు. అది కూడా అచ్చంగా అక్కడున్నాయా అనిపించేలా త్రీడీ ప్రింట్లో తీసుకొస్తున్నారు. గూట్లో నుంచి పిల్లి చేయి చాచినట్టు, మెత్తటి టవల్ మీద పడుకుని ఒళ్లు విరుచుకుంటున్నట్టు, చొక్కాలోంచి కుక్క బయటికి చూస్తున్నట్టూ… చిత్రంగా కనిపిస్తాయి. ‘యానిమల్ త్రీడీ ప్రింటెడ్’ షర్టులుగా మార్కెట్లో దొరుకుతున్నాయి.

సరదా.. సౌకర్యం..
నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి, అలాగని సౌకర్యం విషయంలో ససేమిరా తగ్గొద్దు, చొక్కా మీద మన అభిరుచులు అచ్చేసినట్టు కనిపించాలి.. ఇవన్నీ గంపగుత్తగా కావాలంటే త్రీడీ ప్రింటెడ్ షర్ట్‌లను ఎంచుకోవచ్చు. అంతేకాదు, ఒంటికి హాయిగా ఉండేలా మెత్తటి టీ షర్టు వేసుకుని కూడా నలుగురి కళ్లూ మీ వైపే ఉండేలా, పార్టీలో మీరే ప్రత్యేకంగా కనిపించేలా చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో సరదాగా బయటికి వెళ్లినప్పుడు, చిన్నచిన్న వేడుకలప్పుడు, కాలేజీకైనా, రోజువారీవేసుకునేందుకైనా ఇవి బాగుంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలీ ఎక్స్‌ప్రెస్‌లాంటి వివిధ వెబ్సైట్లు వీటిని అమ్ముతున్నాయి. బొమ్మ నచ్చితే చొక్కా రంగులను మార్చుకుని కూడా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడే ఓ చిక్కుంది… మనుషులంటే ఈ చిత్రాలను చటుక్కున చూసి భలే బాగుందనుకుంటారు కానీ… టామీ చూస్తే మాత్రం కొత్త దాన్ని ఎత్తుకున్నారేమో అని అలిగినా
ఆశ్చర్యపోనక్కర్లేదు!
Read More ;
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

