ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Komarambheem - Jan 23, 2021 , 00:57:56

పల్లె రోడ్లకు మహర్దశ

పల్లె రోడ్లకు మహర్దశ

  • డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.26.45 కోట్లు మంజూరు
  • 26 గ్రామాల్లో తారు దారులకు మరమ్మతులు
  • 144 కిలో మీటర్ల వరకు పునరుద్ధరణ
  • ఇప్పటికే పలు చోట్ల పూర్తి..
  • త్వరలో మిగతా చోట్ల ప్రారంభం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 26 మారుమూల గ్రామాల్లోని తారు రోడ్లను డీఎంఎఫ్‌టీ నిధులతో మరమ్మతు చేస్తున్నారు. సుమారు 144 కిలోమీటర్ల మేరకు రోడ్లు బాగుపడనున్నాయి. 26 రోడ్లకుగాను ఇప్పటికే మూడు గ్రామాల్లో మరమ్మతులు చేశారు. 15 రోడ్లు అభివృద్ధి దశలో ఉండగా, మిగతా 8 రోడ్ల మరమ్మతులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కెరమెరి మండలం మెట్టపిప్రిలో రూ. 76 లక్షలతో 2.50 కిలోమీటర్ల మేర  పునరుద్ధరించారు. సిర్పూర్‌-యు మండలం కోహినూర్‌(కే)లో రూ. 70 లక్షలతో 2.80 కిలోమీటర్లు బాగు చేశారు. దహెగాం మండలం కుంచవెల్లిలో రూ. కోటీ 10 లక్షలతో 5.50 కిలోమీటర్ల రోడ్డుని పునరుద్ధరించారు. ఆసిఫాబాద్‌ మండలం రహపెల్లిలో రూ. 75 లక్షలతో, కొత్త రహపల్లికి రూ. 75 లక్షలు, దడ్‌పాపూర్‌కు రూ. 87.50 లక్షలు, కొమ్ముగూడ గ్రామానికి రూ. కోటీ 12 లక్షల 50 వేలు, వాంకిడి మండలం నార్లపూర్‌కు రూ. కోటీ 20 లక్షలు, మొకాసి గూడకు రూ. 2 కోట్ల 24 లక్షలు, ధాబా గ్రామానికి రూ. 3 కోట్ల 33 లక్షలు, కెరమెరి మండలం బోలపటార్‌లో రూ. 90 లక్షలు, పెద్ద కరంజి వాడలో రూ. 67.50 లక్షలు, లింగాపూర్‌ మండలంలో రూ.కోటీ 25లక్షలు, దహెగాం మండ లం బోర్లకుంటలో రూ.50 లక్షలు, ఒడ్డగూడ నుం చి చిన్నరాస్పల్లిలో 50లక్షలు, పీపీరావు కాలనీ నుం చి చిన్నతిమ్మాపూర్‌ వరకు రూ. కోటీ 19 లక్షల 50 వేలు, చింతలమానేపల్లి మండలం రణవెల్లి నుంచి రవీంద్రనగర్‌-1లో రూ. 90 లక్షలతో పనులు చేపడుతుండగా, అభివృద్ధి దశలో ఉన్నాయి.

త్వరలో 8 గ్రామాల్లో..

డీఎంఎఫ్‌టీ ద్వారా చేపడుతున్న తారు రోడ్ల పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు ప్రారంభం కాని రోడ్లను వెంటనే ప్రారంభించనున్నారు. తిర్యాణి మండలం గంభీరావ్‌పేట్‌లో రూ. 50 లక్షలు, రెబ్బెన మండం నవేగాంలో రూ. 62.50 లక్షలు, కాగజ్‌నగర్‌ మండలం చారిగాంలో రూ. 70 లక్షలు, సిర్పూర్‌(టీ) మండలం కర్జపల్లి నుంచి లోన్‌వెల్లి వరకు రూ. 70 లక్షలు, వెంకట్రావ్‌పేట్‌లో రూ. 40 లక్షలు, కౌటాల మండలం తాటిపల్లిలో రూ. కోటీ 75 లక్షలు, బాబాపూర్‌లో రూ. కోటీ 10 లక్షలు, బెజ్జూర్‌ మండలం మోగవెల్లిలో రూ. 62.50 లక్షలతో తారు రోడ్ల మరమ్మతులు త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


VIDEOS

logo