ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 17, 2020 , 23:54:32

జననేతకు పచ్చని హారం

జననేతకు పచ్చని హారం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ:జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కేక్‌లు కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలంటూ పలు ఆలయాల్లో శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహించి.. మొక్కలు నాటారు. జైనూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అటవీ శాఖ, వైద్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అన్నదానం చేశారు. రెబ్బెన మండల కేంద్రానికి సమీపంలోని ఎల్లమ్మ చెరువు వద్ద ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ మొక్క నాటారు. కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. జిల్లా కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు మొక్కలు నాటారు. కేసీఆర్‌ సేవాదళం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 కేజీల కేక్‌ను కట్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలసి వేడుకులు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో అదనపు ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లలోనూ సిబ్బంది మొక్కలు నాటారు.
logo