శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 22, 2020 , 00:22:10

రైతు బంధు వచ్చేసింది

రైతు బంధు వచ్చేసింది
  • -నాలుగో విడత నిధులు కేటాయించిన సర్కారు
  • -పరిపాలనా పరమైన అనుమతులు
  • -జిల్లాకు రూ. 190 కోట్లు
  • -వారంలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ
  • -లక్షా 17 వేల మందికి ప్రయోజనం
  • -యాసంగి సాగుకు భరోసా ఆనందంలో అన్నదాతలు
అన్నదాతల సంక్షేమం కోసం     రాష్ట్ర సర్కారు చేపడుతున్న ‘రైతు బంధు’ నాలుగో విడత డబ్బుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5100 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా పరమైన అనుమతులివ్వగా, జిల్లాకు రూ. 190 కోట్లు వచ్చే అవకాశమున్నది. వారంలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుండగా, లక్షా 17 వేల మందికి ప్రయోజనం చేకూరనున్నది. ప్రస్తుతం యాసంగి సాగు పనులు సాగుతుండగా, సాయమందించడంపై కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
 కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి,
నమస్తే తెలంగాణ

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అన్నదాతలకు అండగా నిలవాలనే ఆలోచనతో సీ ఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం నా లుగో విడుత నిధులను అందించేందుకు రాష్ట్ర స ర్కారు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథ కం అమలు కోసం రూ. 5100 కోట్లను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మొదట్లో ఎకరాకు రూ. 4 వేలు ఇచ్చిన సర్కారు, గతేడాది ఖరీఫ్‌ నుంచి రూ. వెయ్యి పెంచి రూ. 5వేలు చేసింది. వారంలోగా నాలుగో విడుత డబ్బులు అందజేయనుండగా, జిల్లాలో లక్షా 17 వేల562 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

అన్నదాతల్లో ఆనందం

గత మూడు సీజన్లలో పంటల సాగుకోసం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ప్రభు త్వం అందజేసింది. ఈ సీజన్‌లో కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంతో జిల్లాలోని 15 మండలాల పరిధిలో లక్షా 17 వేల 562 మం దికి రైతులకు ఈ పథకం వర్తించనుంది. నిధుల వి డుదలకు ఇప్పటికే పరిపాలనా పరమైన అనుమతు లు మంజూరు చేసిన ప్రభుత్వం, త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పెట్టబడితో అండగా..

పంటల పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకుండా ప్రభుత్వమే ఆర్థిక సాయం రెండేళ్లుగా అందజేస్తోంది. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అదే విధంగా యాసంగి పంటలకు కూడా పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ. 5 వేల చొప్పున అందిస్తోంది. యాసంగి పంటకు సంబంధించి రైతు బం ధు సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే రైతుల ఖాతాల్లోకి..

యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులు త్వరలోనే రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రభుత్వం చేస్తోంది. జిల్లాలో దాదాపుగా లక్షకు పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. సుమారు రూ. 190 కోట్లు జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది.
- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
logo