వేతనాలు ఇవ్వండి మహాప్రభో..!
ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు వేతనాల కోసం ఆందోళనకు దిగారు. ఏజెన్సీ కంపెనీ ఎల్అండ్టీ వారు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
- దమ్మాయిగూడెంలో మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన
- ఎల్అండ్టీ మేనేజర్, అధికారుల నిర్బంధం
- పోలీసుల జోక్యంతో విడుదల
- విధుల బహిష్కరణతో గ్రామాల్లో నిలిచిపోయిన తాగునీటి సరఫరా
తిరుమలాయపాలెం, జూలై 16 : ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు వేతనాల కోసం ఆందోళనకు దిగారు. ఏజెన్సీ కంపెనీ ఎల్అండ్టీ వారు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్యాలయానికి వచ్చిన ఎల్అండ్టీ కంపెనీ జిల్లా మేనేజర్ ఎల్కే రెడ్డి, ఇద్దరు అధికారులను కార్యాలయంలో నిర్బంధించి ధర్నా చేశారు. కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.19,000 జీతం ఇస్తుంటే ఎల్అండ్టీ కంపెనీ, అధికారులు కుమ్మకై రూ.13,000 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. జీతాల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని మేనేజర్‌ను నిలదీశారు. ప్రభుత్వం నుంచి కంపెనీకి బిల్లులు వచ్చేవరకు స్పష్టత ఇవ్వలేమని మేనేజర్ వారికి తెలిపారు. దీంతో వేతనాలు ఇచ్చేవరకు విధులను బహిష్కరిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం ఎస్ఐ గిరిధర్‌రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకొని కార్మికులతో మాట్లాడడంతో మేనేజర్, అధికారులను వదిలేశారు. మిషన్ భగీరథ కార్మికులు విధులను బహిష్కరించడంతో మండలంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

