అతివలు అదుర్స్..
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్‌లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్‌శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- భద్రాద్రి జిల్లాలో ఓటేసిన 3,58,744 మంది మహిళలు
- పార్లమెంట్ ఎన్నికల్లో వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- కలెక్టర్ ప్రత్యేక చొరవతో కదిలొచ్చిన ఓటర్లు
- ప్రభావం చూపిన అవగాహన కార్యక్రమాలు
- పోలింగ్‌రోజు ప్రత్యేక మహిళా కేంద్రాలు
భద్రాద్రి కొత్తగూడెం, మే 14 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్‌లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్‌శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశాలతో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 4,79,626 మంది పురుష ఓటర్లు ఉండగా 3,47,461 మంది ఓట్లు వేశారు. ఒకచోట కాదు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లకు తగ్గట్టుగానే మహిళలు ఓటువేసి చైతన్యాన్ని నింపారు. గత నెలరోజులుగా అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఓటింగ్‌పై మంచి ప్రభావం చూపాయని చెప్పవచ్చు.
ఆదర్శంగా ఆడబిడ్డల ఓటింగ్..
జిల్లాలో అధికసంఖ్యలో మహిళా ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో పురుషులు 70,190 మంది ఓటు వేయగా మహిళలు 71,235 మంది ఓటు వేశారు. ఇల్లెందులో పురుషులు 78,112 మంది, మహిళలు 80,536 మంది, భద్రాచలంలో పురుషులు 51,386 మంది, మహిళలు 53,991 మంది, అశ్వారావుపేటలో పురుషులు 63,203 మంది, మహిళలు 65,643 మంది, కొత్తగూడెంలో పురుషులు 84,570 మంది, మహిళలు 87,339 మంది ఓటు వేసి సత్తా చాటుకున్నారు.
ఓటుకు తరలివచ్చిన వృద్ధులు..
ఓటుహక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు సైతం తరలివచ్చారు. దీంతోపాటు హోం ఓటింగ్ కూడా కలిసొచ్చింది. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించడంతో వారు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉచిత ఆటోలు, ట్రై సైకిళ్లు పెట్టడం వల్ల ఇబ్బందులు లేకుండా ఓటు వేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా మహిళలు చైతన్యం చాటుకున్నారు.
ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలు..
వందశాతం ఓటింగ్ జరగాలనే లక్ష్యంతో కలెక్టర్ ప్రియాంక ఆల పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారు. భద్రాద్రి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు కలిసి ఉండడంతో అధికారులు సమన్వయంతో పనిచేశారు. 172 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు అంగన్వాడీ, ఐసీపీఎస్, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. అన్ని మండల కేంద్రాల్లో 2కే రన్లు, త్రీకే రన్లు ఏర్పాటు చేసి చైతన్యం కల్పించారు. దీంతోపాటు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి ఓటరుకు అవగాహన కల్పించారు. అన్నింటిలో మహిళలు ముందుండాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అయినట్లు ఓటింగ్‌ను చూస్తే తెలుస్తుంది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

