గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం..
బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఇండియా కూటమి ఆధ్వర్యంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పదేళ్లుగా అడ్డగోలు పాలన చేసిన ప్రధాని మోదీ మొన్నటి ఎన్నికల్లో చతికిలపడ్డారని, ఆయన ఆటలు ఇక సాగనివ్వమని అన్నారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కొణిజర్ల, జూన్ 25 : బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఇండియా కూటమి ఆధ్వర్యంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పదేళ్లుగా అడ్డగోలు పాలన చేసిన ప్రధాని మోదీ మొన్నటి ఎన్నికల్లో చతికిలపడ్డారని, ఆయన ఆటలు ఇక సాగనివ్వమని అన్నారు. మంగళవారం చిన్నగోపతి గ్రామంలో లింగాల భూషణంనగర్లో రెండు రోజులపాటు జరిగే రాజకీయ శిక్షణా తరగతులకు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్ హాజరయ్యారు. అనంతరం అమరుల స్థూపాల వద్ద పార్టీ జెండాలను ఎగురవేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కమ్యునిస్టులు బలపడుతున్నారని అన్నారు. అగ్రరాజ్యం అని చెప్పుకుంటూ సామ్రాజ్యవాద విధానాలు అవలంబిస్తున్న అమెరికా నేడు చైనా అభివృద్ధిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా నీట్ పరీక్ష పేపర్లు లీక్ చేసిందని, వెంటనే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ‘మతోన్మాదం’ అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర బాధ్యుడు మిట్టల రవి మాట్లాడారు. శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్‌గా మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు వ్యవహరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, మండల కమిటీ బాధ్యు లు డాక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు, చింతనిప్పు వెంకయ్య, అన్నారపు వెంకటేశ్వర్లు, చింతపల్లి ప్రసాద్, లింగాల దానయ్య, బుర్రి గోపయ్య, మోత్కూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

