‘పేట’ రక్షకభట నిలయం.. నిత్య వివాదాలమయం
అభాగ్యులకు అండగా నిలవాల్సిన అశ్వారావుపేట రక్షకభట నిలయం ఇటీవల తరచూ వివాదాలమయంగా మారుతోంది. సాక్షాత్తూ ఇక్కడి పోలీసులు, సిబ్బందికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్లిన తమకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.
- సాక్షాత్తూ పోలీసులు, సిబ్బందిపై అవినీతి మరకలు
- పోలీసు స్టేషన్లో అన్యాయం జరుగుతోందంటున్న బాధితులు
- ఇటు సిబ్బంది పట్ల అధికారి దూషణలు, దుర్భాషలు
- అటు ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ ఫిర్యాదులు
- శాంతిభద్రతల కంటే సంపాదనకే ప్రాధాన్యమన్నట్లు ఆరోపణలు
- స్థానిక పోలీసులపై మండల ప్రజల్లో చులకన భావం
- ఇక్కడి అధికారులపై ఉన్నతాధికారుల అసంతృప్తి
అశ్వారావుపేట, జూన్ 17 : అభాగ్యులకు అండగా నిలవాల్సిన అశ్వారావుపేట రక్షకభట నిలయం ఇటీవల తరచూ వివాదాలమయంగా మారుతోంది. సాక్షాత్తూ ఇక్కడి పోలీసులు, సిబ్బందికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్లిన తమకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక నిస్పక్షపాత విధుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ వంటి వాటికంటే సంపాదనకే ఇక్కడి పోలీసులు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా స్థానిక పోలీసులపై మండల ప్రజలకు చులకన భావం ఏర్పడింది. మరోవైపు ఇక్కడి సిబ్బందిపై పోలీసు అధికారులు అమర్యాదగా ప్రవర్తిస్తుండడం, దూషణలు, దుర్భాషలు వంటివి చేస్తుండడం వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో విసిగిపోయిన కొందరు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
సిబ్బందిపై దుర్భాషలు..
అశ్వారావుపేట పోలీసు స్టేషన్‌పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కినా అన్యాయమే జరుగుతోందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సిబ్బందిని సమన్వయం చేసుకోవాల్సిన ఓ అధికారి.. తన అక్రమార్జనకు సహకరించని, మాట వినని సిబ్బందిపై దుర్భాషలాడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ దూషణలకు మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ ఆ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిపై కక్షపెంచుకున్న సదరు అధికారి.. ఆ కానిస్టేబుల్‌పై మరో కానిస్టేబుల్‌తో డివిజనల్ స్థాయి అధికారికి ఫిర్యాదు చేయించాడు. మొదటి కానిస్టేబుల్ తోటి సిబ్బందిని వేధిస్తున్నాడంటూ తప్పుడు కంప్లెయింట్ ఇప్పించాడు. ఇదే క్రమంలో న్యాయం కోసం స్టేషన్‌కు వస్తున్న బాధితుల విషయంలోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. బాధితులెవరైనా న్యాయం కోసం వచ్చి ఫిర్యాదులు అందిస్తే.. వారి ప్రత్యర్థులను కేసుల నుంచి తప్పించడానికి స్వయంగా పోలీసులే ప్రత్యర్థులతో ప్రతి ఫిర్యాదు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో ఇక్కడి పోలీసుల తీరుపై జిల్లా ఉన్నతాధికారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో ఇక్కడి అధికారి, సిబ్బంది మధ్య మరో సర్కిల్ స్థాయి అధికారి సమన్యయ సమావేశం నిర్వహించినా ప్రయోజనం లేకపోపోయింది.
ఇటీవల వచ్చిన ఆరోపణల్లో కొన్ని..
గత నెల 9న పాపిడిగూడెం రోడ్డులో ఒక ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పంచనామా కూడా సిద్ధమైంది. కానీ కేసు నమోదు కాలేదు.
ఈ నెలలోనే గుమ్మడవల్లి సమీపంలో జరిగిన కోడి పందేల కేసు పలు మలుపులు తిరిగింది. పందేల స్థావరంపై పోలీసులు దాడి చేసి బైకులు, కోడి పుంజులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కానీ పందేలు నిర్వాహకుడిని వదిలేసి.. పట్టుబడిన జూదరుల్లో కొందరిపైనే కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో జూదరుల్లో ఒకరైన సాయిల అశోక్ బహిరంగంగానే ఆరోపణలు చేశాడు. పైగా ఖర్చుల నిమిత్తం నిందితుల్లో ఒక్కొక్కరూ రూ.1,500 చొప్పున ఇవ్వాలంటూ ఇక్కడి పోలీసులు డిమాండ్ చేసినట్లు వాపోయాడు
ఈ నెల 7న ఇసుక లేకుండా ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. విడుదల కోసం యజమాని నాగరాజు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కానీ ట్రాక్టర్‌ను రిలీజ్ చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. అయితే కేసు నమోదు సమయంలో ట్రాక్టర్లో ఇసుక ఉన్నట్లుగా పంచనామా చేసినట్లు సమాచారం. ఆర్డర్ ప్రకారం ఇసుకను రెవెన్యూ శాఖకు అప్పగించిన తర్వాతే ట్రాక్టర్ విడుదలవుతుంది. లేని ఇసుకను ఎక్కడ నుంచి తేవాలనే సంశయంతోనే ట్రాక్టర్ విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
అదే రోజు వినాయకపురంలో మట్టి తరలిస్తున్న ఒక జేసీబీని, ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మతలబుల అనంతరం వాటిని వదిలేశారు.
గత నెలలో అనంతారం వాగు నుంచి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్న సిబ్బంది కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు మందలించడంతో కేసు నమోదు చేశారు.
విధుల్లో ఉన్న సిబ్బందిపై ఒక అధికారి దుర్భాషలాడారు. దీనిపై ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవటానికి సదరు అధికారి తనకు అనుకూలమైన మరో కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి మరీ మొదటి కానిస్టేబుల్‌పై ప్రతి ఫిర్యాదు చేయించాడు.
పశువులు తరలిస్తూ పట్టబడిన వాహనాల రిలీజ్‌తోపాటు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వాహన సామర్థ్యాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కోడిపందేల్లో పట్టుబడిన వాహనాలను స్వాధీనం చేసుకోకుండా, జూదరులను అదుపులోకి తీసుకోకుండా ఇళ్లకు పంపించి వేస్తున్నారు. తరువాత స్టేషన్‌కు తీసుకొస్తున్నారు. స్టేషన్ అధికారి సొంత చట్టం అమలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనేక అవినీతి ఆరోపణలు స్టేషన్‌లోని మరికొందరు సిబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు.
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యం కేసును తారుమారు చేశారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. తొలుత బాలిక అదృశ్యమైనట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత నిందితుడిని తప్పించే విధంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఆ బాలిక అదృశ్యం కాలేదని, తన బంధువుల ఇంటికి వెళ్లిందని కేసును మార్చినట్లు సమాచారం. కానీ బాలిక తన ప్రేమికుడితో కలిసి ఏపీలోని కుక్కునూరు మండలానికి వెళ్లింది. అక్కడ వారు శారీరకంగా కలుసుకోవడాన్ని గుర్తించిన పోలీసులు.. బాలికను అశ్వారావుపేట తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఆరోజు కొన్ని బైకులు వదిలేశారు..
అప్పట్లో కోడిపందేల కేసులో పందేలు నిర్వహించిన అసలు వ్యక్తిని పోలీసులు కేసు నుంచి తప్పించారు. అదే కేసులో రెండు బైకులను వదిలిపెట్టారు. ఇదేమిటని అడిగిన మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఖర్చుల కింద ఒక్కొక్కరి నుంచి రూ.1,500 చొప్పున అడిగారు. తాము ఇవ్వలేమని చెప్పినా వినడం లేదు.
-సాయిల అశోక్, గుమ్మడవల్లి
ప్రజల అపోహలు మా దృష్టికి వచ్చాయి..
పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది వ్యవహారం వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న అపోహాలు మా దృష్టికి వచ్చాయి. శాంతి భద్రతల పరిరక్షణే మా కర్తవ్యం. ఎవరికీ ఎటువంటి అన్యాయమూ జరగకుండా చట్టపరంగా వ్యవహరిస్తాం. అపోహలను ప్రజలు నమ్మవద్దు.
-జితేందర్‌రెడ్డి, సీఐ, అశ్వారావుపేట
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

