Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Karepalli | ఖమ్మం జిల్లా కారేపల్లి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు.
కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి ( Dara Savitri ) అకాల మృతి విద్యారంగానికి తీరని లోటని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ( Teachers Union Leaders ) అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సావిత్రి సంతాప సభను ఆదివారం ఖమ్మం పట్టణంలోని ఆర్టీసీ కాలనీ వంశీకృష్ణ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు హాజరై మాట్లాడారు. సావిత్రి మృతి తమను తీవ్రంగా కలచివేసిందన్నారు.
విద్యార్థులందరినీ తన బిడ్డలుగా భావించి ఆప్యాయతతో చూసుకునేవారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా భావించి విద్యార్థుల అభ్యున్న తికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. విధుల పట్ల ఆమె చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల కనబరిచిన ఆప్యాయత, సహచర ఉపాధ్యాయులతో ఉన్న సత్సంబం ధాలను స్మరించుకున్నారు. ఆమె సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మృతురాలి భర్త ఉపేందర్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు షేక్ గౌసుద్దీన్, ఖలీల్ ఉల్లాఖాన్, సీనియర్ జర్నలిస్ట్ పగడాల నాగేశ్వరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

