ఓటమి భయంతోనే నాపై తుమ్మల దిగజారుడు వ్యాఖ్యలు
ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంగళవారం స్థానికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
- ఆయన గౌరవప్రదంగా మాట్లాడలేకపోతున్నారు
- నాపై బట్ట కాల్చి మీద వేస్తానంటే.. ఊరుకునేది లేదు
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, నవంబర్ 7: ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంగళవారం స్థానికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తుమ్మల తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ తన వ్యక్తిత్వాన్ని అధఃపాతాళాని తొక్కేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉండి కూడా తుమ్మల గౌరవప్రదంగా మాట్లాడలేకపోతున్నారన్నారు. తనపై బట్ట కాల్చి మొహం మీద వేస్తానంటే.. ఊరుకోబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తుమ్మల చిత్తు చిత్తుగా ఓడిపోతారన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు, కొత్తపల్లి నీరజ, చిరమామిళ్ల లక్ష్మీనాగేశ్వరరావు, రాయల శేషగిరిరావు, జకంపూడి వీరభద్రం, నలజాల రవి, మారగాని సుదర్శన్, రామారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

