నాకు 60 ఏండ్లు
భద్రాచలం వద్ద గోదావరి నదిపై 1965, జూలై 13న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారధి శనివారం 60వ పడిలోకి అడుగుపెట్టింది. ఆనాడు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
- అప్పట్లో నా ఖర్చు రూ.70 లక్షలే..
- నాలుగు రాష్ర్టాలకు పయనం నాపైనే..
- రామయ్య సన్నిధికి వారధి నేను..
- టన్నులకొద్దీ బరువులు మోశా.. ఇంకా మోస్తా..
- ఎన్నో వరద ఆటుపోట్లు తట్టుకున్నా..
“హలో.. నా వయస్సు 60 ఏండ్లు. నా ప్రయాణంలో ఎన్నో టన్నులకొద్దీ బరువులు మోశాను. ఎన్నెన్నో వరద బీభత్సాలను తట్టుకున్నాను. మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. అయినా మరెన్నో ఏళ్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎంతటి బరువునైనా మోయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా. గోదావరి తోడుగా నా పయనాన్ని శక్తి ఉన్నంతవరకు కొనసాగిస్తా..”
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 13 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం వద్ద గోదావరి నదిపై 1965, జూలై 13న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారధి శనివారం 60వ పడిలోకి అడుగుపెట్టింది. ఆనాడు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌హెచ్ 30కి అనుసంధానంగా ఉన్న ఈ బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాలకు వారధిగా నిలిచింది. ఎన్నో వరదలను, ఆటుపోట్లను తట్టుకొని నిరంతరాయంగా వాహనదారులకు సేవలందిస్తోంది. ఇప్పటివరకు ఏమాత్రం చెక్కుచెదరలేదంటే అప్పటి నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
దక్షిణ అయోధ్య భద్రగిరి కొండపై కొలువై ఉన్న రామయ్యకు గోదావరి వారధి పెద్ద పేరు తెచ్చిపెట్టింది. 1965వ సంవత్సరంలో నిర్మించిన గోదావరి బ్రిడ్జి శనివారం 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆనాటి కట్టడం నేటికీ చెక్కుచెదరకుండా మారుమూల ప్రాంతాల గిరిజనులను బాహ్యప్రపంచానికి పరిచయం చేసిన తొలి వంతెన భద్రాద్రి బ్రిడ్జిగా పేరు తెచ్చుకుంది. భద్రాచలానికి దూరప్రాంతాల నుంచి భక్తులు రావాలంటే ఆనాడు కేవలం పడవ తప్ప వేరే మార్గమే లేదు. అప్పట్లో నదిలో నీరు లేనప్పుడు కాలినడకన భక్తులు బూర్గంపాడు మండలం గొమ్మూరు నుంచి వచ్చేవారు. నీరు పెరిగితే పడవపై వచ్చేవారు. అప్పట్లో పడవపై ప్రయాణించే 150 మంది మృతిచెందడంతో భద్రాచలానికి వారధి అనివార్యమైంది. అదే గోదావరి బ్రిడ్జిగా నామకరణం చేశారు.
మన్యానికి వారధిగా భద్రాద్రి బ్రిడ్జి..
ఉమ్మడి ఖమ్మంజిల్లాతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భద్రాచలం పట్టణానికి రావాలంటే బస్సులు లేని సమయంలో కాలినడకన వచ్చే ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వారధి నిర్మాణంతో అన్ని ప్రాంతాల ప్రజలు భద్రాచలం రావడం చాలా సులువైంది. భద్రాచలంలో జరిగే రామయ్య కల్యాణం, ముక్కోటి, రామయ్య పట్టాభిషేకం, గోదావరి పుష్కరాలు చూడాలంటే భక్తులకు వారధి ఎంతగానో ఉపయోగపడింది. దీంతో మన్యానికి వారధి గిరిజన ప్రాంతాలకు ఒక వరంలా మారింది.
నాలుగు రాష్ర్టాలకు ఇదే రహదారి..
కేవలం ఖమ్మంజిల్లానే కాదు ఇతర రాష్ర్టాలకూ ఈ వారధి ఎంతగానో ఉపయోగపడింది. ఒడిశా, ఛతీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు ఈ బ్రిడ్జి రహదారిగా మారింది. దీంతో రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా పోయింది. భద్రాచలానికి ఇప్పుడు అంత పేరు వచ్చిందంటే అది గోదావరి బ్రిడ్జి పుణ్యమే అని చెప్పాలి. ఒకవైపు భద్రాచలం పేపర్ బోర్డుకు వెదురు మన్యం ప్రాంతాల నుంచి రావాలంటే కోట్ల విలువైన సంపదకు రవాణా సౌకర్యంగా మారింది.
ఎన్నో వరదలను తట్టుకున్న చరిత్ర..
ఎక్కడో వరద వస్తే ఇక్కడ ప్రాంతాలు మునిగి పోవాల్సిందే. అలాంటి ఉగ్ర గోదావరి వరదల సమయంలో భీకరంగా పొంగి ప్రవహిస్తుంటే తట్టుకున్న గోదావరి బ్రిడ్జి కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 11 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించినా ప్రవాహానికి ఎదురొడ్డి నిలిచిన చరిత్ర ఉంది. తొలిసారిగా 1976లో 63.9 అడుగులు వరద ప్రవాహం వచ్చింది. 1986లో 75.6 అడుగులు వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 1990లో 70.8అడుగులు మేర నీటిమట్టం వచ్చింది. గత ఏడాదిలో కూడా 71 అడుగులు వరద వచ్చినా వంతెనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన వంతెన కట్టడం చాలా గట్టిదే.
రామయ్య సన్నిధికి పెన్నిధి..
జగదభిరాముడి కల్యాణాన్ని తిలకించడానికి ప్రతిఏటా లక్షల మంది భక్తులు వస్తున్నారంటే ఆ ఘనత గోదావరి బ్రిడ్జిదే. దాదాపు ఐదు రాష్ర్టాల నుంచి భక్తులు పుష్కరాల మొదలు ముక్కోటి, పట్టాభిషేకాలకు అధికసంఖ్యలో వస్తుంటారు. అంతటి చరిత్ర కలిగిన ఈ వంతెన పక్కనే మరో వారధి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకుంది. గత రామయ్య కల్యాణానికి భక్తులు రెండవ వారధిపై కూడా రాకపోకలు సాగించారు.
రూ.70 లక్షలతో నిర్మాణం పూర్తి..
అప్పట్లో కేవలం రూ.70 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న వంతెన 3,934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కో పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో నిర్మాణం చేపట్టారు. చాలా తక్కువ ఖర్చుతో నిర్మాణం చేపట్టిన ఈ వంతెనను రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1965లో ప్రారంభించారు. అప్పటి నిర్మాణాలు ఎంత పటిష్టంగా ఉంటాయో చెప్పడానికి ఈ వంతెనే సజీవ సాక్ష్యం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

